జెఇఇ-మెయిన్స్ ఫలితాలు విడుదల
24 మందికి వంద శాతం మార్కులు
న్యూఢిల్లీ : ఇటీవల నిర్వహించిన జెఇఇ-మెయిన్ పరీక్షల్లో 24 మంది విద్యార్థులు వందశాతం మార్కులను సాధించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ పరీక్షలను గతంలో రెండు సార్లు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జెఇఇ -మెయిన్ పరీక్షా ఫలితాలను శుక్రవారం రాత్రి ప్రకటించారు. కాగా, ఈ 24 మందిలో ఎనిమిది మంది తెలంగాణ విద్యార్థులు, ఐదుగురు ఢిల్లీ విద్యార్థులు, రాజస్థాన్ నుండి నలుగురు, ఎపి నుండి ముగ్గురు, హర్యానా నుండి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుండి ఒక్కరు చొప్పున ఉన్నారు. ఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఈ పరీక్షలను సెప్టెంబర్ 1 నుండి 6 వరకు నిర్వహించింది. 8.58 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 74 శాతం మంది హాజరయ్యారు. జెఇఇ మెయిన్స్ పేపర్ 1, పేపర్ 2 ఫలితాల ఆధారంగా 2.45 లక్షల మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. కాగా, జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష సెప్టెంబర్ 27న జరగనుంది.

No comments:
Post a Comment