Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ బదిలీల వేగవంతం

సీఎం కార్యాలయం నుంచి దస్ర్తం వచ్చిన వెంటనే.. ఉపాధ్యాయ బదిలీల కోసం ఇతరత్రా ఏర్పాట్లతో రెడీ

  • ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల బదిలీ ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ కోసం సర్వత్రా ఆసక్తి ఉంది. 
  • ముఖ్యమంత్రి జగన్ సైతం టీచర్ల బదిలీలు చేయాలని ఇటీవలే అధికారులతో అన్నారు. 
  • విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్ సైతం మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుందని చెప్పిన గడువు కూడా ముగిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉపాధ్యాయుల బదిలీ ఫైలు ఉందని సమాచారం. అక్కడి నుంచి సంతకంతో వచ్చిన వెంటనే ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 
  • మరో వైపు విద్యాశాఖ కమిషనర్ సైతం బదిలీలు చేపట్టేందుకు వీలుగా పూర్తి  సంసిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు  పూర్తి చేస్తున్నారు.  రేషనలైజేషన్ ప్రక్రియ కొలిక్కి తీసుకు వచ్చారు. 
  • రేషన్ లైజేషన్ కు సంబంధించి జిల్లా విద్యాధికారులు సిద్ధం చేసిన నివేదికలు, సంబంధిత అంశాల పరిశీలన ప్రక్రియ సైతం పూర్తయింది.  ప్రస్తుతం ఏ స్కూలులో ఏ పోస్టు  ఖాళీగా ఉంది,  
  • 5 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? 8 ఏళ్ల పైబడి అక్కడ పని చేస్తున్న టీచర్లు ఎవరెవరు? ఏ స్కూలులో ఎందరు అనే అంశాలపై సిద్ధమైన  సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ మరో మారు తనిఖీ చేస్తోంది.
  •  జిల్లా విద్యాధికారుల ద్వారా ఆయా  పాఠశాలలకు ఈ సమాచారం పంపి ప్రధానోపాధ్యాయుల నుంచి సరి చూసి అధికారికంగా ఖరారు చేసే ప్రక్రియ సాగుతోంది. రెండు రోజుల్లో  ఈ వివరాలన్నీ పక్కాగా ఖరారవుతాయి.  
  • మరో వైపు  టీచర్ల బదిలీలకు సంబంధించి ఆన్ లైన్ లో చేపట్టేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ కూడా సిద్ధమవువతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. 
  • ఉపాధ్యాయులు ఆన్ లైన్ బదిలీలను వ్యతిరేకిస్తున్నా అదే విధానం లోనే ప్రక్రియ చేపట్టబోతున్నారు.
  • ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి  దస్ర్తం వచ్చిన వెంటనే బదిలీలకు  ప్రాథమిక విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND