ప్రవేశాలప్పుడు విద్యార్థులు పాఠశాలలకు వద్దు
➧ విద్యార్థులను పాఠశాలలకు రానీయకుండానే ప్రవేశాల ప్రక్రియ కొనసాగించాలని జిల్లా అధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జూన్‌లో జరగాల్సిన ప్రవేశాలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ప్రవేశాల నిర్వహణకు సంబంధించి తాజాగా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో .. 2019-20 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి 9వ తరగతి మధ్య చదివిన విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లుగా భావించి.. పై తరగతులకు పంపాలని నిర్దేశించింది. ఈ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది.
➧ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్చాలి. దీనికి తల్లిదండ్రుల నుంచి ముందస్తు అనుమతి పొందాలి.
➧విద్యార్థులు చేరదల్చుకున్న బడులకు.. ప్రధానోపాధ్యాయులే టీసీ, ఇతర వివరాలు పంపాలి. వీటితోపాటు తల్లిదండ్రుల సమ్మతి లేఖ జతపర్చాలి.
➧బడిబయట పిల్లలకు ప్రవేశాలు కల్పించే విషయంలో పుట్టిన తేదీ, గుర్తింపు పత్రం (ఆధార్) మినహా మిగిలిన ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయొద్దు.

No comments:
Post a Comment