తెలంగాణ వార్త
14 రోజుల్లో 2,300 మంది ఉపాధ్యాయులకు కరోనా
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,300 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు గత 14 రోజుల్లో కరోనా బారినపడ్డారు. పలు చోట్ల ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారంటూ సంఘ నేతలు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన రెండు రోజుల క్రితం గణాంకాలు సేకరించాలని డీఈవోలను ఆదేశించారు. దీంతో గురువారం అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి సమాచారం అందింది. అందులో జగిత్యాల జిల్లాలో 135 మంది, సిద్దిపేట జిల్లాలో 119 మంది, కరీంనగర్‌లో 103 మంది, పెద్దపల్లి జిల్లాలో 63 మంది కరోనాబారిన పడినట్లు సమాచారం.
2 శాతం మంది ఉపాధ్యాయులకు..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25,500 పాఠశాలల్లో 1.15 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరు గత నెల 27వ తేదీ నుంచి విధులకు హాజరవుతున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి మొదలైన టీవీ పాఠాలను ఆయా పాఠశాలల్లో ఉంటూ పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈనెల 21వ తేదీ నుంచి 50 శాతం ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లొచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆగస్టు 27 నుంచే 100 శాతం ఉపాధ్యాయులు హాజరుకావాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 1.15 లక్షల మందిలో 2,300 మంది అంటే 2 శాతం మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంపట్ల విద్యాశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘ఇందులో చాలామందికి బడులకు రాకముందు వైరస్ సోకినా.. లక్షణాలు తర్వాత బయటపడిన వారూ ఉన్నారు’ అని జిల్లా స్థాయి అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

No comments:
Post a Comment