ఎ.పి డిసెంబర్ 13న ఎన్టీఎస్ఈ పరీక్ష
ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్ 13న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్టీఎస్ఈ) జరగనుంది. పదో తరగతి చదువుతున్న రెగ్యులర్ విద్యార్థులుతో పాటు దూరవిద్య విధానం ద్వారా తొలిసారిగా 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న అభ్య ర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు ఈ మేరకు బుధవారం ఎన్టీఎస్ఈ షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీలోగా ఆన్లై న్లో దరఖాస్తు చేసుకుని, నవంబర్ 9వ తేదీ లోగా పరీక్ష ఫీజు రూ.200 ఏపీ సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల విభాగ వెబ్సైట్ డబ్ల్యూ బ్ల్యూ డబ్ల్యూ . బీఎస్ఈ ఏపీ.ఓఆర్జీ తో పాటు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎన్టీఎస్ఈ ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ చదివేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలను మంజూరు చేస్తుందన్నారు.
No comments:
Post a Comment