పెండింగు జీతం జనవరిలోనే చేతికి ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనాకు సంబంధించి ఇవ్వాల్సిన పెండింగు జీతాలపై ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ఉద్యోగుల చేతికి జీతాలు జనవరిలోనే అందుతాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా కారణంగా మార్చి,ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వం సగం జీతమే చెల్లించింది. ఆ మొత్తాన్ని ప్రస్తుతం అయిదు విడతల్లో తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. అయితే తొలి రెండు నెలలు వారి జీతాల నుంచి మినహాయించాల్సిన తగ్గింపులకే మొదలగు వాటికే కేటాయించనున్నారని తెలిసింది.
ఐ.టీ ,వృత్తి పన్ను, ఎ.పి.జీ.ఎల్.ఐ , ఇన్యూరెన్సు, పీఎఫ్ వంటి వాటి కోసం ఎంతవుతుందో లెక్కించి నవంబర్ , డిసెంబర్ నెలల్లో వాటికి జమ చేస్తారు.
మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది దీన్ని బట్టి జనవరి , ఫిబ్రవరి , మార్చి నెలల్లో ఉద్యోగుల ఖాతాలకు ఆ మొత్తాలు చేరతాయి.
పెన్షనర్లకు రెండు లేదా మూడు విడతల్లో చెల్లించే అవకాశం ఉందని చెబుతున్నారు. జీవో విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.
No comments:
Post a Comment