కేజీబీవీల్లో ధ్రువపత్రాల పరిశీలన
సమగ్ర శిక్షా ఆధ్వ ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో(కేజీబీవీ) 2020- 21 విద్యా సంవత్సరానికి గాను 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు నాలుగో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రి సెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 5వ తేదీ నుంచి 22 తేదీలోపు తమ ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫి కెట్, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి పాస్ షార్ట్ మెమో తదితర పత్రాలతో సంబంధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు కేజీబీవీల్లో పదో తరగతి చదివి, పాసైన విద్యార్థుల ధ్రువపత్రాలు సంబంధిత కేజీబీవీల్లోనే తీసుకోవచ్చని తెలిపారు. సందేహాలకు 94412 70099, 94943 ంర 0 సం 020 ఎస్పీడీ వెట్రిసెల్వి సూచించారు.
No comments:
Post a Comment