Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయులకు కలిగే కొన్ని సందేహాలు వాటి సమాధానాలు

 సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:

అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా? ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు. 2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు ?

జవాబు:

ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.

ప్రశ్న:

ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?*

జవాబు:

ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది ?

జవాబు:

వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.

(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

ప్రశ్న:

దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా ?

జవాబు:

FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కించవచ్చును.* *G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.

    ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా ?

జవాబు:

ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND