త్వరలో అన్ని శాఖల్లో హెచ్ సీయం
అధికారులుకు ఆర్థిక మంత్రి ఆదేశం
సిఎఫ్ఎంఎస్ బలోపేతం చేయాలని సూచన
హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్
ఇకపై అన్ని శాఖల్లో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధికారులకు సూచించారు రాష్ట్ర సమగ్ర ఆర్థిక సర్వీస్ సిస్టమ్ సంస్థ (ఎపి సి ఎఫ్ ఎస్ ఎస్)కు చెందిన పాలనాపరమైన అంశాలపై శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆర్థికశాఖలో మాత్రమే అమలు జరుగుతున్న హెచ్ సిఎంను ఇకపై అన్ని శాఖల్లోనూ విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే సి ఎఫ్ ఎస్ ఎస్ సీని మూడు విభాగాలపైనా సమీక్ష నిర్వహించారు. ఫేజ్-1లోని సిఎస్ఎంఎస్లో బడ్జెట్ నిర్వహణ, ఆదాయ వ్యయాల నిర్వహణ ఉంటాయి ఫేజ్-2లో హెచ్ సిఎం కింద ఉద్యోగుల జీతాలు పింఛన్లు, ఈ-సర్వీస్ రిజిస్టర్లు ఉంటాయి. ఇక ఫేజ్-3లో బిల్లులు, ఇతర ఆర్థికాంశాలు ఉంటాయీ. అందువల్ల ఈ మూడు ఫేజ్ పైనా ప్రత్యేక దృష్టి సారించి, ఎటువంటి అవరోధాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యాన నిర్వహించే కార్య క్రమాలు, అమలు చేసే పథకాలు అన్నీ ఇకపై ఎపిసిఎఫ్ఎస్ఎస్ ద్వారా రాష్ట్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించేలా, నియంత్రించేలా చూడాలని నిర్దేశించారు. హెచ్ సి ఎం అమలు వల్ల ఏ నెలకు ఆ నెల ఉద్యోగుల జీతాలు వారివారి భాగాల్లోకి చేరుకునేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి వివరించారు. ఖజానా తనిఖీలు, పే బిల్లుల సమస్యలు లేకుండా నేరుగా హెచ్ఎం ద్వారా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment