Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌లో మార్పులు

ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌లో మార్పులు

➤ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం విధించిన నిబంధనల్లో మార్పుల కారణంగా షెడ్యూల్‌ రెండు, మూడు రోజులు వాయిదా పడే అవకాశం ఉంది.

➤బదిలీల నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలని ఇటీవల ఉపాధ్యాయ సంఘాలు మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కోరాయి. ఇందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇప్పటికే ఉపాధ్యాయులు చేసిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు రెండు, మూడు రోజులు సమయం పట్టనుంది.

➤ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి శుక్రవారం ఆమోదం లభించనుంది. అనంతరం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

➤పాఠశాలలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నా ప్రస్తుతం 8ఏళ్ళవరకు మాత్రమే పాయింట్ల కేటాయింపు పరిమితి విధించారు. ఈ పరిమితిని తొలగించి, పనిచేసిన కాలానికి పాయింట్లు ఇస్తారు.

➤సర్వీసు పాయింట్లు గరిష్ఠంగా 15 ఉండగా దీన్ని 16.5 పాయింట్లకు పెంచుతారు

➤ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్ల సర్వీసును బదిలీకి ప్రామాణికంగా తీసుకుంటారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND