హెల్త్ కార్డుల్లో సవరణకు అవకాశం
సద్వినియోగం చేసుకోవాలని ఎస్టీయూ పిలుపు
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హెల్త్ కార్డులలో సవరణకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అవకాశం కల్పించారని రాష్ట్రా ప్రాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, మల్లు రఘునాధరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హెచ్ఎస్ లాగిన్ లో హెల్త్ కార్డుల మార్పులను 7 రోజుల్లోగా సరిదిద్దు కోవాలని సూచించారని, అనంతరం ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కార్డుల స్థానంలో స్మార్ట్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు హెల్త్ కార్డుల్లో సమాచారం సవరించుకోవాలని పిలుపు నిచ్చారు. అలాగే మిగిలిన ఉద్యోగులకు చెల్లించినట్లుగా యాజమాన్య వాటా హెల్త్ కార్డుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఎయిడెడ్, గురుకుల, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు అందరితో పాటు స్మార్ట్ హెల్త్ కార్డులు విడుదల చేయాలని ప్రభు త్వాన్ని కోరారు.
No comments:
Post a Comment