AP వెబ్ ఆప్షన్లలో గందరగోళం
అన్ని ఖాళీలకు పెట్టుకోవాలని విద్యాశాఖ జేడీ సూచన
కొన్ని స్థానాలకే సైట్ క్లోజ్.. స్పౌజ్‌పై స్పష్టత కరువు
ఆందోళనలో ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వె బ్ ఆప్షన్ల విషయంలో గందరగోళం నెలకొంది. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు విద్యాశాఖ ప్రదర్శించిన అన్ని ఖాళీలకు ఆప్షన్లు పెట్టుకోవాలని జాయిం ట్ డైరెక్టర్ ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే ఎస్‌జీటీలు ఒక్కొక్కరు కనీసం 1500 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే 50 స్థానాలకు ఇవ్వగానే సైట్ క్లోజ్ అవుతోంది. వెబ్‌సైట్ సర్వర్ సామర్థ్యం పెంచనందునే ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వందలాది ఆప్షన్లు వెబ్‌సైట్‌లో ఎలా నమోదు చేయాలో అర్థంకాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
స్పౌజ్ సమస్య
స్సౌజ్ కేటగిరీలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నవారు. ఇలాంటి వారు తమ భాగస్వామి పనిచేస్తున్న స్కూల్ లేదా కార్యాలయానికి సమీపంలోని పాఠశాలలకే ఆప్షన్లు ఇవ్వాలని, ఎక్కువ హెచ్‌ఆర్‌ఏ వస్తుందని దూరప్రాంతాలకు ఇస్తే చర్యలు తీసుకుంటామని పాఠశాల జేడీ హెచ్చరించారు. అలాంటి వారు ఏ స్థానాలకు ఆప్షన్లు ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై స్పష్టత కరువైంది.
No comments:
Post a Comment