అమ్మఒడి షెడ్యూల్
లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం షెడ్యూల్ రూపొందించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. ఈ నెల పది నుంచి ప్రారంభమైన అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు కార్యక్రమం 20వరకు ఉంటుందని మంత్రి చెప్పారు. 16న అర్హులైన విద్యా ర్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలను వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయల్లో ప్రదర్శిస్తామన్నారు. 18న ప్రదర్శనకు ఉంచిన జాబితాలో తప్పొప్పుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 8 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ లో లబ్ధిదారుల జాబితా ఉంచుతా మన్నారు. 20న సంభదిత పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాళ్లతో పాటు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది చే సవరించిన జాబితా పరిశీలన చేస్తారన్నారు. 26న తుది సవరణ అనంతరం జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామ న్నారు. 27,28 తేదీల్లో తుది సవరణ జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందుతాయన్నారు. 28న గ్రామ సభల ద్వారా ఆమోదం పాందిన జాబితాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లచే ఆన్ లైన్లో పొందుపర్చడం జరుగుతుందన్నారు. 30న ఫైనల్ జాబితాలను కలెక్టర్లకు పంపుతారని అదేరోజు తుది జాబితాలను జిల్లా కలెక్టర్ల ఆమోదం తెలుపుతారని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
జనవరి 9న ‘అమ్మ ఒడి’ సాయం
16 నుంచి ప్రక్రియ ప్రారంభం: ఆదిమూలపు సురేశ్
‘జగనన్న అమ్మ ఒడి’ ఆర్థిక సాయాన్ని వచ్చే నెల 9న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేయనున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రెండో విడతగా అందిస్తున్న ఈ సాయం కోసం అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల, సంరక్షుల పేర్లతో జాబితాలు సిద్ధం చేశామని తెలిపారు. మంత్రి సురేశ్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఒక్కో విద్యార్థి తరఫున రూ.15 వేలు చొప్పున అందించే సాయం కోసం 2020-21 సంవత్సరానికి ఇంకా అర్హులు మిగిలి ఉంటే సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. గతేడాది 43,54,600 మంది తల్లిదండ్రులకు రూ.6,336 కోట్ల ఆర్థిక సాయం అందించాం. అర్హతపై గతేడాది నిబంధనలే ఈసారీ వర్తిస్తాయ’ని మంత్రి వివరించారు. రేషన్ కార్డుల తొలగింపుతో కొందరు విద్యార్థులు అర్హత కోల్పోయే ఆస్కారముందని విలేకరులు ప్రశ్నించగా.. ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు.
పథకం అమలులో వివిధ దశల షెడ్యూలు
డిసెంబరు 16: అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన
19-12-20: అభ్యంతరాలు, సూచనలపై జాబితాల్లో సవరణ, అదేరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మఒడి పోర్టల్‌లో ప్రదర్శన
20 నుంచి 24: పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కళాశాల ప్రిన్సిపల్, సచివాలయాల సిబ్బందితో సవరించిన జాబితాల పరిశీలన
26-12-20: తుది జాబితాలు మళ్లీ సచివాలయాల్లో ప్రదర్శన
27 నుంచి 28: సవరించిన జాబితాలకు గ్రామ, వార్డు సభల్లో ఆమోదం
29-12-20: ఆమోదించిన జాబితాలను అదేరోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం
30-12-20: తుది జాబితాలను కలెక్టర్లు, జిల్లా డీఈవోలకు పంపడం, అదేరోజు కలెక్టర్ల ఆమోదం
9-1-2021: విద్యార్థుల తల్లి/ సంరక్షుకుల ఖాతాలో సొమ్ము జమ.
No comments:
Post a Comment