కరోనా మార్గదర్శకాల గడువు పొడిగింపు
జనవరి 31 వరకు వర్తింపు
రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం హుకుం
న్యూఢిల్లీ :దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్ర భుత్వం మరోసారి పొడగించింది. జనవరి 31 వరకు కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 25న కేంద్రహోంశాఖ, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ విడుదలచేసిన మార్గదర్శకాలనే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేయాలని తెలిపింది. వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని తెలిపింది. కరోనా అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలేజనవరి 31 వరకు వర్తిస్తాయని తెలిపింది. కంటైన్ మెంట్ జోన్ల గుర్తింపు, ఆయా జోన్లలో కఠినంగా వ్యవహరించాలని తెలిపింది. భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, కానీ కొత్త కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపింది. బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. వైరస్ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
No comments:
Post a Comment