17న పల్స్ పోలియో వాయిదా
అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమాచారం
దేశవ్యా ప్తంగా ఈ నెల 17న నిర్వహించాల్సిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్రం వాయిదా వేసింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శలకు ఆదివారం సమాచారం పంపింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆపేయాలని సూచించింది. ఊహించని విధంగా ఇతర కార్యాకలపాలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే పల్స్ పోలియోను వాయిదా వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పల్స్ పోలియోలో ప్రధానంగా ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎ మ్లు, అంగన్ వాడీ టీచర్లు కలిపి మొత్తం 69వేల మంది పాల్గొంటారు. కానీ, వీరందరూ కొవిడ్ వ్యాక్సి నేషన్లోనూ పాల్గొనాల్సి ఉంది. రెండింటినీ ఒకేసారి నిర్వహిస్తే ఇతరత్రా సమస్యలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పల్స్ పోలియోను కేంద్రం వాయిదా వేసి నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment