విద్యార్థుల 'ఎత్తు' నమోదు చేయండి
పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఆదేశాలు
➖➖➖➖➖
జగనన్న విద్యా కానుక లో భాగంగా 1 నుండి 10 వ తరగతి చదివే విద్యార్థుల ఎత్తు వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయు విధానము
➖➖➖➖➖
విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు వీలుగా వారి కొలతలు తీసుకో వాలని అధికారును పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. జగనన్న విద్యా కానుక కిలో భాగంగా ఒకట్నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫాం అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని సరఫరా చేసేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఎత్తు (సెంటిమీటర్లలో)ను సేకరించాలని నిర్ణ యం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు వి.చినవీరభద్రుడు వివరిం చారు. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు వారి ఎత్తు వివరాలు ప్రధా నోపాధ్యాయులు తమ లాగిన్ లో ఇచ్చిన లింక్ లో నమోదు చేయాలన్నారు.కరోనా నిబంధనలు అనుసరించి ఈ పని పూర్తిచేయాలని తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేలా మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, జిల్లా సిఎంఒలను ఆదేశించారు.
విద్యార్థి ఎత్తు కొలతలు నమోదు విధానం::
⊹ కింది క్రమాన్ని పాటించవలెను.
❖కింది లింక్ ద్వారా చైల్డ్ ఇన్ఫో యూజర్ ఐడి ,పాస్వర్డ్ ను ఉపయోగించి.. ప్రధానోపాధ్యాయులు లాగిన్ కావలెను.
➠ https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES
❖తదనంతరం.. SERVICE ను ఎంచుకొని..UPDATE STUDENT HEIGHT DETAIL Form ను CLICK చేయాలి.
❖తదుపరి వచ్చు UPDATE STUDENT HEIGHT Details Form ( Box) నందు విద్యార్థి ఐ.డీ నెంబర్ నమోదు చేయాలి.
❖తరువాత ..
↦SCHOOL CODE.
↦STUDENT ID.
↦STUDING CLASS.
↦STUDENT NAME.
↦GENDER.
↦STUDENT AADHAAR NO.
↦MOTHER/GUARDIAN NAME.
↦ SELECT STUDENT HEIGHT..
❖మొదలగు వివరాలతో కూడిన FORM ఓపెన్ అవుతుంది.
❖ఈ వివరాల చివర ఉన్న.. SELECT STUDENT HEIGHT.. ఆప్షన్ను తాకితే 50 నుండి 185 సెంటీమీటర్ల వరకు కొలతలు అగుపిస్తాయి.
❖ఇందులో విద్యార్థి యొక్క సరైన కొలతను ఎంచుకొని .. SUBMIT DATA పై CLICK చేయవలెను.
❖ దీనితో ఒక విద్యార్థి యొక్క ఎత్తు కొలత విజయవంతంగా నమోదవుతుంది.
❖ ఈ విధానాన్ని ప్రతి విద్యార్థికి అనుసరిస్తూ పోవాలి.
No comments:
Post a Comment