కౌశల్ సైన్స్ క్విజ్ పోటీ
క్విజ్ బృంద అర్హత: క్విజ్ బృంద ఎంపిక కోసం 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాల నుంచి తరగతికి 10 మందిని అనుమతిస్తారు.
సిలబస్: 7, 8, 9 తరగతుల గణితం, సైన్స్ విజ్ఞానభారతి వారి ‘విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి’ మెటీరియల్.
బహుమతులు: ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచే బృందాలకు నగదు బహుమతులు, జ్ఞాపికలు, ధ్రువపత్రాలను అందజేస్తారు.
పోస్టర్ ప్రజంటేషన్ పోటీ: 8, 9 తరగతుల నుంచి ఇద్దరేసి విద్యార్థులను (రెండు ప్రజంటేషన్లు) ఒక్కో పాఠశాల నుంచి అనుమతిస్తారు. ఎరపిక చేసిన 12 పోస్టర్లను జిల్లాస్థాయి పోటీలకు తీసుకుంటారు.
బహుమతులు: నగదు బహుమతులతో పాటు జ్ఞాపిక, ధ్రువపత్రాలను అందజేస్తారు.
పేర్ల నమోదు ఇలా..
ఈ నెల 31లోగా నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 9న ప్రాథమిక స్థాయి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. జిల్లాస్థాయి పోటీలను ఫిబ్రవరి 16న, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 27న ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా www.bvmap.org వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కౌశల్ రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీల అకడమిక్ సమన్వయకర్త వై.రవీంద్ర తెలిపారు.
అంశాలు
1. విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయుల కృషి
2. జల సంరక్షణ
3. జీవ వైవిధ్య పరిరక్షణ
4. వాతావరణ మార్పులు
5. ప్రకృతి వ్యవసాయం
6. సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతులు
క్విజ్ బృంద ఎంపిక
8, 9, 10 తరగతుల్లో పాఠశాల స్థాయిలో మొదటి స్థానం పొందిన విద్యార్థులను ఒక బృందంగా ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి పోటీలకు గరిష్ఠంగా 36 బృందాలను ఎరపిక చేస్తారు. కేవలం ప్రభుత్వరంగ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
సంప్రదించాల్సిన చరవాణి నంబర్లు
94933 13271, 94405 07133, 94410 50024,
94934 75689, 99639 22087, 98496 27708, 99894 54749.
No comments:
Post a Comment