మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశం: ఏ.పి సి.యం
విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష..
ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశమని చెప్పారు. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కారణంగా దీన్ని ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సీఎం సోమవారం సమీక్షించారు. టాయిలెట్ నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కళాశాల, పాఠశాల స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. శానిటరీ పరికరాలు, ప్లంబింగ్ సమస్యలు వస్తే వెంటనే వాటిని బాగు చేయాలన్నారు. దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘‘విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు- నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరూ చేయనిరీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాగే పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులను తీసుకురావడానికి టాయిలెట్ ఫండ్‌ను ఏర్పాటు చేసి.. వాటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. రానున్న కాలంలో వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల పరిశుభ్రతలో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్ టేకర్లకు అవగాహన కల్పించాలి. మరుగుదొడ్లను ఒకరు వినియోగించిన తర్వాత కచ్చితంగా శుభ్రం చేయాలి. టాయిలెట్ల నిర్వహణలో సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి’’ అని అధికారులకు సీఎం సూచించారు. టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు.
మరుగుదొడ్లు నిర్వహణ
★ ఫిబ్రవరి 1నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లు ఉండాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
★ మరుగుదొడ్ల నిర్వహణ ప్రాధాన్యతాంశమని చెప్పారు. టాయిలెట్లు లేకపోవడం, ఉన్నవాటిని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.
★ ఈ కారణంగా దీన్ని ప్రాధాన్యతా కార్యక్రమంగా చేపట్టినట్లు వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో సీఎం సోమవారం సమీక్షించారు.
★ టాయిలెట్ నిర్వహణ నిధిపై రాష్ట్ర, జిల్లా, కళాశాల, పాఠశాల స్థాయుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
★ ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా పరిశుభ్రమైన టాయిలెట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు.
★ శానిటరీ పరికరాలు, ప్లంబింగ్ సమస్యలు వస్తే వెంటనే వాటిని బాగు చేయాలన్నారు. దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌వోపీ) తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
★ ‘‘విద్యా సంస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నాడు- నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధనను అందుబాటులోకి తీసుకొచ్చాం.
★ ఎవరూ చేయనిరీతిలో విద్యార్థుల పోషకాహారం కోసం ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అమలు చేస్తున్నాం.
★ అలాగే పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పరిస్థితులను తీసుకురావడానికి టాయిలెట్ ఫండ్‌ను ఏర్పాటు చేసి.. వాటిని పరిశుభ్రంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
★ రానున్న కాలంలో వీటి నిర్వహణ అత్యుత్తమంగా ఉండాలి. టాయిలెట్ల పరిశుభ్రతలో వాడే రసాయనాల వినియోగంపై కూడా కేర్ టేకర్లకు అవగాహన కల్పించాలి.
★ మరుగుదొడ్లను ఒకరు వినియోగించిన తర్వాత కచ్చితంగా శుభ్రం చేయాలి. టాయిలెట్ల నిర్వహణలో సులభ్ లాంటి
★ సులభ్ లాంటి సంస్థల అనుభవాన్ని, వారి నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి’’ అని అధికారులకు సీఎం సూచించారు.
★ టాయిలెట్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ తయారు చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు.
No comments:
Post a Comment