PD అకౌంట్ సమాచారం
ఉపాధ్యాయ మిత్రులందరికీ శుభోదయం.. మిత్రులు కొందరు బదిలీలు కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమితులయ్యారు..
అయితే మన పాఠశాలలో ప్రతి టీచరుకు *ఒక పొజిషన్ ఐడి* ఉంటుంది.. మీ పాఠశాలలో ఎందరు టీచర్లు ఉంటే అన్ని పొజిషన్ ఐడి లు ఉంటాయి..
ప్రధానోపాధ్యాయులుగా నియమించబడిన వారు *ముందు నంబరు పొజిషన్ ఐడి* లో ఉండేలా చూసుకోవాలి.. (ఇది MRC లో మన MEO గారు బయోమెట్రిక్ వేయడం ద్వారా చేస్తాము)..
ఉదా :- ఒక పాఠశాల లో రెండు పోస్టులు ఉన్నాయి.. వాటి పొజిషన్ ఐడి లు ఇలా ఉన్నాయి అనుకుందాం..
1) 35745778
2) 35745779
HM గా ఉన్న వారు 35745778 పొజిషన్ ఐడి లో అంటే *ముందు నంబరు పొజిషన్ ఐడి* లో ఉండాలి. కారణం.. *ముందు నంబరు పొజిషన్ ఐడి లో ఉన్నవారికే CFMS వారు PD అకౌంట్ చేయడానికి కావలసిన టైల్స్ ఎలాట్ చేస్తారు*..
*మన మండలంలో ఉపాధ్యాయులు ఎవరు ఏ పొజిషన్ ఐడి లో ఉన్నారో మీకు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది..*
2020 - 21 విద్యాసంవత్సరానికి పాఠశాల, PMC తదితర గ్రాంట్లు ఇప్పటికే మన పాఠశాల PD ఎకౌంట్ లలో జమ అయ్యాయి..
*ఇన్నాళ్ళు HM గా పని చేసి మీరు ఖర్చు పెట్టినదానికి మీరు వెంటనే PD అకౌంట్ బిల్ చేసుకోవచ్చు..*
*లేదా..*
కొత్త HM గారు PD అకౌంట్ బిల్ చేసినా.... ఇప్పటివరకు మీ పాఠశాలలో HM గా పనిచేసిన వారు పెట్టిన ఖర్చు కు *వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యేలా* కూడా PD అకౌంట్ బిల్ చేయవచ్చు..
*ఎవరూ కంగారు పడకండి PD ఎకౌంట్ విషయంలో మీకు అన్ని విధాల సూచనలు, సలహాలు మరియు సహకారం అందించబడతాయి..*
PD ACCOUNT BILL చేయాలంటే క్రింది ఉన్న మూడు forms తప్పకుండా fill చేసి upload చేయవలసి ఉంటుంది. కావున అందరూ print తీయించుకోండి.
No comments:
Post a Comment