పెన్ను, పేపర్ లేకుండానే జనాభా లెక్కింపు
డిజిటల్ జనగణనకు రూ. 3,768 కోట్లు
ఈ ఏడాది జనాభా లెక్కలు పెన్ను, పేపర్ లేకుండానే నిర్వహించనున్నారు. డిజిటల్ రూపంలో జరగనున్న జనగణన కోసం రూ. 3,768 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ సెన్సస్ ప్రక్రియ దేశచరిత్రలోనే తొలిసారి కానుంది. కాగా, మొబైల్ ఫోన్ ఆధారంగా 2021 జనాభాలెక్కల సేకరణ ఉంటుందని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పెన్ను-పేపరు ఉపయోగించడం ద్వారా జరిపే సంప్రదాయ జనాభా లెక్కల సేకరణ స్థానంలో అధునాతన సాంకేతికతను వినియోగించే డిజిటల్ ప్రక్రియ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.‘‘ సెన్సస్ డేటాను మొబైల్ యాప్ ద్వారా సేకరిస్తారు. జనాభా లెక్కల నమోదు ప్రక్రియలోనే ఇదో విప్లవాత్మకమైన చర్య’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన మొబైల్ యాప్‌లో కుటుంబ యజమానే ఇతర సభ్యుల వివరాలను అప్‌లోడ్ చేసుకునే వీలుంటుందని కేంద్ర హోంమంత్రి తెలిపారు.
No comments:
Post a Comment