టెన్త్ పరీక్షలకు కొత్త నమూనా
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
పేపర్లను ఏడుకు కుదించిన విద్యా శాఖ
ప్రశ్నల కేటగిరీల్లో మార్పులు...
ప్రశ్నపత్రం చదివేందుకు విద్యార్థులకు 15 నిమిషాల అదనపు సమయం
రాష్ట్రంలో టెన్త్ పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో పదో తరగతిలోని 11 పేపర్లను 7పేపర్లకు కుదించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ , ఇంగ్లీష్.. మదమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, బయాలాజికల్ సైన్స్ , ఫిజికల్ సైన్సు పేపర్లను 50మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇది అమలు కానుంది. ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి మిగిలిన 20 మార్కులను అంతర్గత మార్కుల నుంచి తీసుకొని కలిపేవారు. గతేడాది ఈ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వుచిచ్చింది. ఇందుకు సంబంధించి ప్రశ్నపత్రాల ప్యానలో మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానం లోనూ కొన్ని సవరణలు చేసింది. గతేడాది పరీక్షల నిర్వహణ లేకపోవడంతో, అవి అమలు కాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త ప్యాట్రన్ గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. ప్రశ్నపత్రాల్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాలు ప్రశ్నలు, స్వల్ప సమాధానాలు ప్రతులు, వ్యాసరూప ప్రశ్నలను అడగనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 2:30 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తారు.
No comments:
Post a Comment