విద్యారంగ బడ్జెట్లపై ‘కొవిడ్’ ప్రభావం
దిల్లీ:కొవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చదువులపైనే కాకుండా విద్యకు కేటాయించే బడ్జెట్లపైనా ప్రభావం చూపింది. అనేక దేశాలు ఈ కేటాయింపులను కుదించుకోవాల్సి వచ్చింది. కరోనా కారణంగా తక్కువ, అల్ప మధ్యాదాయ దేశాల విద్యాబడ్జెట్లలో ఏకంగా 65 శాతం కోత పడింది. ఎగువ మధ్యాదాయ దేశాలు 33 శాతం కోత వేయాల్సిన పరిస్థితి నెలకొంది. యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (జీఈఎం) రిపోర్టుతో కలసి ప్రపంచబ్యాంకు రూపొందించిన తాజా నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. ఇందుకు గాను ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని 29 దేశాల (భారత్ సహా) నుంచి శాంపిళ్లను తీసుకున్నారు. మహమ్మారిని అదుపు చేసేందుకు స్కూళ్లలో చేపట్టాల్సిన చర్యలు, బడులు మూతపడిన సమయంలో విద్యార్థులకు చదువుల విషయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి నిధులు ఖర్చు చేయాల్సి వస్తున్నట్లు నివేదిక తెలిపింది. అర్జెంటినా, బ్రెజిల్, ఈజిప్టు, భారత్, మయన్మార్, నైజీరియా, పాకిస్థాన్, రష్యాల్లో కేటాయింపుల్లో విద్యారంగం వాటా 10 శాతం లోపే ఉన్నట్లు వెల్లడించింది.
No comments:
Post a Comment