సివిల్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్
ప్రిలిమినరీ పరీక్షకు అవకాశం కల్పించిన కేంద్రం
సివిల్స్ విషయంలో.. కేంద్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ ప్రి లిమినరీ పరీక్షలు రాస్తున్న సివిల్స్ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. గతేడాది కోవిడ్ మహమ్మారి వల్ల జరిగిన ప్రిలిమినరీ పరీక్షలకు హాజరుకా లేకపోయిన అభ్యర్థులకు మరోసారి ఛాన్స్ ఇవ్వ నుంది. జనవరి 22వ తేదీన సుప్రీంలో జరిగిన వాదనలో.. అభ్యర్థులకు అదనపు ఛాన్స్ ఇచ్చేం దుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా.. గతేడాది సివిల్స్ కుచివరి అవకాశం ఉన్నవారికి మాత్రమే ఈ ఊరట కల్పించారు.సివిల్ సర్వీసెస్ అభ్యర్థి రచనా సింగ్ వేసిన పిటిషన్ ను సుప్రీం విచారించింది. గత ఏడాది అక్టోబ ర్లో ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. కరోనా కారణంగా ఆ సమయంలో కొంత మంది పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఈ పరీక్ష రాయలేకపోయిన వారికి అదనపు అవకాశం కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 సెప్టెంబర్ లో ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను 2020లో లాస్ట్ అటెంప్ట్ చేసిన అభ్యర్థులకు వయస్సు లిమిట్ ను పెంచే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తు న్నామని యూపీఎస్ సీ సుప్రీంకు తెలిపిన విషయం తెలిసిందే. మళ్లీ ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని, వ్యవస్థపై ప్రభావం చూపుతుందని జనవరి 22న సుప్రీంకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలు జనవరి 8 నుంచి 17 వరకు జరిగాయి. ప్రిలి మినరీ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా దాదాపు 1000 మంది అభ్యర్థు లు మెయిన్ పరీక్షకు ఎంపికయ్యారు.సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 నోటిఫికేషన్ 10న విడుదలయ్యే అవకాశం ఉంది.
No comments:
Post a Comment