Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP:Inter Hall tickets Download

AP  : నేటి నుంచి ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్లోడ్ ....

  • ➤సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌...
  • ➤రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ....
  • ➤ అత్యధికంగా తూగో.. అత్యల్పంగా గుంటూరులో పరీక్షా కేంద్రాలు ...

➧విజయవాడ: ఇంటర్మీడియెట్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవని, మే5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ గారు  మరోసారి స్పష్టం చేశారు.

➧విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని, కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

➧ఈ క్రమంలో రాష్ట్రంలో మే 5 నుంచి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

➧పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థలు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

➧ ఈరోజు(ఏప్రిల్‌ 29) సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.

➧ఈ సందర్భంగా శ్రీ  ఆదిమూలపు సురేష్‌ గారు  మాట్లాడుతూ.. ''కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం. ఇందకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోల్చితే ఈ సారి అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం.

➧తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 146 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేస్తాం. ప్రతి పరీక్షా కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేశాం. విద్యార్థుల భవిష్యత్, భద్రత ప్రభుత్వ బాధ్యత అని మంత్రి గారు  స్పష్టం చేశారు.*

 ➧''ప్రతి సెంటర్‌లో ఒక పారా మెడికల్ సిబ్బందితో పాటు ఐసోలేషన్‌ రూమ్ ఏర్పాటు చేస్తాం. కోవిడ్ లక్షణాలు ఉంటే వారిని ఐసోలేషన్‌ రూమ్‌లో పరీక్ష రాయిస్తాం. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణ జరపనున్నాం. దేశంలో ఎక్కడా ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదు. అన్ని భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తాం అని సురేష్‌ గారు  తెలిపారు.

Click here to Download Hall tickets


Mobile లో  Desktop mode on చేయండి.


No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND