షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీ క్షలు షెడ్యూల్ ప్రకారం యథాతథంగా జరు గుతాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ తెలిపారు. సీబీఎస్ఈ పరీ క్షలను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకో వటంతో రాష్ట్రంలో పరిస్థితిపై ఆయన బుధ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రతిరోజూ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. రాను న్నరోజుల్లో కోవిడ్ కేసులు పెరిగితే అప్పుడు పరీక్షల నిర్వహణపై ఆలోచిస్తాం. కోవిడ్ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం. పరీక్షల నిర్వహణపై సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చిస్తాం. ఇప్పటికైతే యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు జరిపే ఆలోచనలో ఉన్నాం' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment