మొబైల్‌లో ఉపాధ్యాయుల హాజరు నమోదు.
ఉపాధ్యాయుల హాజరును మొబైల్ ఫోన్‌లోనే నమోదు చేసేలా యాప్‌ను రూపొందిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు వెల్లడించారు. యాప్‌ల వినియోగానికి సంబంధించి వారం, పది రోజుల్లో మరో సమావేశం నిర్వహించనున్నట్లు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సోమవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన తెలిపారు. సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు..
- నెలవారీ పదోన్నతుల్లో కేటగిరి 3, 4 మాత్రమే భర్తీ చేస్తారు
- కొవిడ్-19 బారినపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవులు
- అర్హులైన ప్రధానోపాధ్యాయులకు ఉప విద్యాధికారులుగా పదోన్నతి
- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయడమా? లేదంటే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించడమా? అనే దానిపై త్వరలో నిర్ణయం
- పాఠశాలలు జూలై 1న పునఃప్రారంభం
- మండల విద్యాధికారుల బదిలీలపై త్వరలో నిర్ణయం.
యాప్ సమస్యలపై త్వరలో వర్క్ షాప్
ప్రమోషన్లు, డిప్యుటేషన్లపైనా స్పష్టత
ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశంలో డైరెక్టర్ వెల్లడి
➤రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కారంపై ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారుతున్న యాప్ల సమస్యపై వారం పదిరోజుల్లో మంత్రి సమక్షంలో వర్క్ షాపు నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల హాజరుకు సంబంధించి మొబైల్ ఫోనులో హజరు నమోదు చేసేందుకు వీలుగా యాప్ ను రూపొం దిస్తున్నట్లు, విద్యార్థుల హాజరుకు సంబంధించి తరగతుల వారీగా విభజించి నమోదు చేసేలా సులభతరం చేస్తున్నట్లు వివరించారు. మధ్యాహ్న భోజన పథకం, శానిటేషన్ కు సంబంధించి ఫొటోలసంఖ్యతగ్గిస్తామని, ఉపాధ్యాయులకు భారం కాకుండా చూస్తామని, ఏరకంగా భారం తగ్గించాలనేది వర్క్షాపులో నిర్ణయిద్దామని ఉపాధ్యాయ సంఘాలకు సూచించారు.
➤అలాగే రీ-అప్పోర్టన్, బదిలీల వల్ల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిన చోట్ల పోస్టుల భర్తీకి సంబంధించి ప్ర భుత్వం డీఎస్సీ ప్రకటించాలా?, లేక అకడమిక్ ఇనస్ట్రక్టర్లను నియమించాలా అనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోందని త్వరలో ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందని వివరించారు. ఉపాధ్యాయులకు నెలవారీ ప్రమోషన్లుఇచ్చేందుకు అభ్యంతరం లేదని, దీనిపై ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంతర్ జిల్లా బదిలీలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేసారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎస్టీటీలుగా పనిచేస్తున్న వారిలో పీహెచ్డీ చేసి అర్హులైన వారు ఉంటే డైట్ లెక్చరర్స్ గా డిప్యుటేషన్ పద్ధతిన నియమిస్తామని చెప్పారు. కొవిడ్ దృష్ట్యా పాఠశాలలు ఏ విధంగా నడపాలనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. కొవిడ్ బారినపడిన ఉపాధ్యాయులకు ప్రత్యేక సెలవు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సక్కా వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్, ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ జోసఫ్ సుధీర్ బాబు, మల్లు రఘునాథ రెడ్డి, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment