టీసీ సమర్పణకు 30 రోజుల గడువు
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
విద్యార్థులు పాత బడి నుంచి కొత్త పాఠశాలలో చేరే సమయంలో టీసీ లేకపోయినా ప్రవేశాలు కల్పించాలని, టీసీ సమర్పణకు తల్లిదండ్రులకు 30 రోజులు సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 కారణంగా ఈ సమయం ఇస్తున్నట్లు పేర్కొంది. గత విద్యా సంవత్సరంలో టీసీలు లేకుండా ప్రవేశాలు నిర్వహించగా.. ఈసారి మార్పు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు దరఖాస్తు చేసిన తర్వాత సకాలంలో టీసీలను జారీ చేయకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చిన వారికి మాత్రం ఎలాంటి టీసీ లేకుండానే 1-10 తరగతి వరకు ప్రవేశం కల్పించాలని సూచించింది.
No comments:
Post a Comment