నేడు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం
నూతన విద్యా విధానంపై రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఎపి ఎసిఇఆరిటీ శనివారం సమావేశం కానుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన, పొందని సంఘాలతో డైరెక్టరు ప్రతాప్ రెడ్డి చర్చించనున్నారు. నూతన విద్యావిధానానికి సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బడుల నిర్వహణ, పాఠ్యాంశాల బోధనపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలతో, మధ్యాహ్నం 3:30 గంటల నుంచి గుర్తింపు పొందని సంఘాలతో రెండు సార్లు నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment