సందేహం - సమాధానం
ప్రశ్న:
Sir, హిస్తరెక్టమి ఆపరేషను జరిగితే దానికి ఆ మహిళ ఉద్యోగికి 45 ప్రత్యేక సెలవులు కదా..... మరి జీతం నెలనెలా ఆపకుండా ఇస్తారా లేక జీతం అపేసి మళ్లీ డ్యూటీలో చేరిన తర్వాత ఇస్తారా? కొంచెం తెలుపగలరు.
జవాబు:
ఏ సెలవు పెట్టినా జీతం రొటీన్ గా ఇవ్వరు. మీరు పెట్టిన సెలవు మంజూరు అయితేనే ఇస్తారు. జీతం బిల్లు తయారు చేసే సమయానికి మంజూరు అయితే అందరితో పాటు వస్తుంది. లేకపోతే ఎప్పుడు మంజూరు చేస్తే అప్పుడు వస్తుంది. మీకు ఆ ఆపరేషన్ అయిన తరువాత నీ ఆఫీస్ వాళ్ళు sanction ప్రొసీడింగ్స్ ఇస్తే, అది బిల్ కి enclose చేస్తే జీతం వస్తుంది.
ప్రశ్న:
నా స్నేహితుడు 2022 సంవత్సరంలో రిటైర్ అవుతాడు. అతని APGLI బాండ్లు A,B&C లు అందులో పేర్కొన్న మెచ్యురిటి డేట్లు దాటి పోయాయి. అతను ఆ బాండ్లను ఇప్పుడే APGLI ఆఫీసులో సబ్మిట్ చెయ్యాలా ? లేకపోతే రిటైర్మెంటు సమయంలో చెయ్యాలా తెలుపగలరు.? అందులోని అమౌంట్ ఎప్పుడు వస్తుంది.?
జవాబు:
ఆ బాండు లలో meturity date ఉంటుంది. అది దాటిన వెంటనే APGLI ఆఫీస్ కు పంపించవచ్చు. రిటైర్మెంట్ వరకు ఆగ వలసిన పనిలేదు.
ప్రశ్న:
జూనియర్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన ఆరు నెలల తర్వాత అనారోగ్యం కారణంగా రివర్సను తీసుకున్న కలిగే పరిణామాలను తెలుపగలరు
జవాబు:
మీకు ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ గా నియామక పత్రాలు ఇచ్చారో, వారికి దరఖాస్తు చేయాలి వారు మరల మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ డిపార్ట్మెంట్ లో నియామకపు అధికారి వారికి తెలియజేస్తారు. వారు మరల మీకు ఈ పని చేయవలసిన ప్రదేశాన్ని కేటాయింపు చేస్తారు. మరల భవిష్యత్తులో బహుశా ప్రమోషన్ అవకాశం ఉండదు. జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు మీ వేతన స్కేలు వేతనం యధావిధిగా ఉంటాయి. ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేసిన కాలం కూడా జూనియర్ అసిస్టెంట్ గా లెక్కించబడుతుంది.
మీరు సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన 6 నెలలు అయితే మిమ్మల్ని రివర్స్ ఉత్తర్వులు గవ్నమెంట్ పరిధి అనగా మీ డైరెక్టర్ గాని కమిషనర్ పరిధిలో ఉంటది మీ జిల్లా ఆఫీసర్ పరిధిలో ఉండదు
No comments:
Post a Comment