Form 26AS : ఐటీఆర్ ఫైల్ చేసే ముందు వివరాలు చెక్ చేయండి
➧ఫారం 26ఏఎస్‌ను కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు.
➧నిర్థిష్ట ఆర్థిక లావాదేవీల(ఎస్ఎఫ్‌టీ)లో, పేర్కొన్న పరిమితికి మించి లావాదేవీలు చేసినప్పుడు, సంబంధిత సమాచారాన్ని ఆయా సంస్థల నుంచి ఆదాయపు పన్ను శాఖ సేకరిస్తుంది.
➧ఈ సమాచారం మొత్తం ఫారం 26 ఏఎస్‌లో పొందుపరుస్తారు.
➧బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, బ్రోకింగ్ సంస్థలు మొదలైన వారు పేర్కొన్న పరిమితి మించి చేసే లావాదేవీల సమాచారాన్ని ఆదాయపు శాఖకు అందిస్తాయి.
➧రూ.10 లక్షలుకు మించి మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, షేర్లు కొనుగోలు చేసినప్పుడు వాటిని జారీ చేసిన సంస్థలు పన్నుశాఖకు నివేదిస్తాయి.
➧పన్ను చెల్లింపుదారులకు ముందుగా పూర్తిచేసిన (ఫ్రీఫైల్లింగ్) ఫారంలను అందించేందుకు గానూ వడ్డీ ఆదాయం, మూలధన రాబడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని బ్యాంకులు, పోస్టాఫీసులు, సంస్థలు, ఎక్స్‌ఛేంజ్‌లను, ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే కోరింది.
➧మూలంవద్ద పన్ను(టీడీఎస్), మూలం వద్ద సేకరించిన పన్ను(టీసీఎస్)లకు సబంధించిన సమాచారాన్ని ఫారం26ఎఎస్‌లో పొందుపరుస్తారు.
➧ఉద్యోగులకు సంబంధించి సంస్థలు డిడక్ట్ చేసిన టీడీఎస్ కూడా ఫారం 26ఏఎస్‌లో ప్రతిబింబిస్తుంది.
➧అందువల్ల ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేప్పుడు ఫారం 26ఏఎస్ ధృవీకరించడం ముఖ్యం.
➧పేర్కొన్న పరిమితికి మంచిన లావాదేవీలు నిర్వహించిన అందరి సమాచారాన్ని సంస్థలు, ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.
➧అందువల్ల ఒక్కోసారి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.
➧ఒకవేళ ఈ పొరపాటు మీ విషయంలో జరిగి, ఏదైనా ఎంట్రీ తప్పుగా నమోదైతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది
No comments:
Post a Comment