ఆదాయపుపన్ను - అడుగులు మూడు.
ఒకటి
మన పెన్షన్ నుండి నన్ను మినహాయింపు
కంప్యూటర్లు వచ్చిన తరువాత ఈ పనిని అవే చేస్తున్నాయి. డిఆర్ జమ కాకుండానే, పన్ను మినహాయింపు జరిగి పోయింది.
ఇలా జరిగిన మినహాయింపు వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.
(Tan అనేది ఒకరకంగా జీరో అకౌంట్ లాంటిది.)
రెండు
TAN అకౌంట్ లో జమయైన మొత్తాలను పాన్ నంబర్ల ప్రకారం వారి వారి ఖాతాలలో జమ చేయాలి. అలా చేసినపుడే TDS పూర్తి అవుతుంది. ఇది DDO బాధ్యత.
ఇందుకుగాను మే,15 గడువు. కరోనా నేపధ్యంలో యీ గడువు జూలై, 31 వరకూ పెంచారు.
మూడు
మనం ఈ -ఫైలింగ్ చేయడం ద్వారా మూడో అడుగు పూర్తవుతుంది. మనం ఈ -ఫైలింగ్ చేసేప్పుడు ముందుగా 26ఏయస్ చూడాలి. అక్కడ నమోదైన పన్ను వివరాలు పరిశీలించి ఈ -ఫైలింగ్ చేయాలి. పన్ను చెల్లించవలసివస్తే అప్పుడు కూడా చెల్లించవచ్చు. అదనంగా మన నుంచి మినహాయించినది మన బ్యాంక్ ఎకౌంట్ లో జమ పడుతుంది. ఈ -ఫైలింగ్ చివరి తేదీ సెప్టెంబరు, 30 వరకే పొడిగించారు.
--------------------------------------------
ప్రశ్న : ప్రతీ నెల నా జీతం నుండి IT ని మా DDO గారు cut చేయిస్తున్నారు. చాలా సంత్సరాల నుండి ఇలాగే చేస్తున్నాం. నేను టాక్స్ కట్టినట్ల కదా ?
జ: కాదు, మీరు కట్టిన వేల రూపాయలు tax వృధా అవుతుంది. ఎందుకనగా మీ DDO గారు నీ పేరు మీదుగా cut చేసిన Tax వెళ్లి DDO TAN అకౌంట్ లో పడుతుంది.(Tan అనేది ఒకరకంగా జీరో Account లాంటిదే) అక్కడే టాక్స్ జమ అయి ఉంటుంది .కానీ ప్రభుత్వం నకు నీ పేరు మీదుగా చేరకుండా Unknown గా ఉంటుంది.
ప్రశ్న : నేను కట్టిన టాక్స్ నా పేరు మీదుగా ప్రభుత్వం నకు చేరాలంటే ఏమి చేయాలి.?
జ: ముందుగా మీ DDO గారి ద్వారా మీరు కట్టిన tax ను chalan no తొ పాటుగా నీ యెక్క PAN accountlo జమ చేయించుకోవాలి.దీన్నే TDS అంటారు. TDS process అయితేనే నీ PAN అకౌంట్లో నీవు కట్టిన టాక్స్ జమ అవుతుంది.
ప్రశ్న : TDS చేయిస్తే నేను టాక్స్ కట్టినట్లేనా?
జవాబు: కాదు. మీరు ఈ -ఫైలింగ్ చేయించడం ద్వారా మీ టాక్స్ ను ప్రభుత్వం నకు కట్టినట్లు అవుతుంది.చివరకు TDS-ఈ-ఫైలింగ్ అయ్యే కొద్దీ ఖర్చుకు వెనుకడుగు వేసి, వేల రూపాయల పన్నును చేతుల్లో నుండి జారవిడుచుకుంటున్నాం. పన్ను కట్టి కూడా కట్టని కోవలోకి వెళ్తున్నారు.
ఆలోచించి సరయిన సమయంలో ప్రతిస్పందించండి.
మీరు ప్రతినెల కట్ చేయించిన టాక్స్ ని TDS చేయించుకుని సరియైన సమయంలో ఈ-ఫైలింగ్ చేయిస్తేనే మీరు ప్రభుత్వం దృష్టి లో పన్ను చెల్లింపు దారులు కోవలోకి వస్తారు.
No comments:
Post a Comment