Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Service Rules: సందేహాలు - సమాధానాలు

Service Rules: సందేహాలు - సమాధానాలు 

ప్రశ్న: నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు?

జవాబు: మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.

ప్రశ్న: నేను రక్త దానం చేశాను. spl. CL ఎవరు ఇస్తారు?

జవాబు: జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే spl. CL కూడా మంజూరు చేస్తారు.

ప్రశ్న: ఇంక్రిమెంట్ ఉన్న నెలలో మెడికల్ లీవ్ పెట్టి , తరువాత నెలలో విధులలో చేరితే ఇంక్రిమెంట్ ఎప్పట్నుంచి ఇస్తారు ?

జవాబు: సెలవు ముందు రోజు జీతం ఎంత ఉన్నదో ఆ మొత్తాన్ని సెలవు కాలమంతా జీతముగా చెల్లిస్తారు. విధులలో చేరిన తర్వాత ఇంక్రిమెంట్ మంజూరు చేసి అప్పటి నుండి మాత్రమే ఇంక్రిమెంట్ మొత్తము కలిపి జీతం చెల్లించుతారు.

G.O.Ms.133 Fin Dt.13.05.1974

G.O.Ms.192 Fin Dt.01.07.1974

ప్రశ్న: On duty తరువాత రోజు CL పెట్టరాదా ?

జవాబు: వెళ్లినప్పుడు టి.ఏ తీసుకుంటే CL  పెడితే టి.ఏ చెల్లించబడదు. ఎందుకనగా On Duty .తరువాత Dutyలో తప్పనిసరిగా చేరాలి.టి.ఏ అవసరం లేదంటే CL పెట్టవచ్చును.

ప్రశ్న: క్రొత్తగా విధులలో చేరిన ఉద్యోగులు సెలవురోజులలో చేరవచ్చునా ! అభ్యంతరాలు ఉన్నావా ?

జవాబు: సెలవు రోజులలో చేరకూడదు

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND