BASE LINE TEST DETAILS
జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు 1 నుండి 10 వ తరగతి విద్యార్థులకు బేస్లైన్ పరీక్షల నిర్వహణకు సూచనలు..
1) జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు బేస్లైన్ పరీక్షలను ఈనెల 27 నుండి 31 వ తేదీ వరకు జరుగునట్లు సంబంధిత తనిఖీ అధికారులు పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించవలెను.
2) ప్రధానోపాధ్యాయులు సంబంధిత ఉపాధ్యాయులను ఆయా సబ్జెక్ట్ లలో బేస్ లైన్ పరీక్షల పేపర్స్ లను తయారు చేయించమని చెప్పవలెను.కొన్ని మాదిరి బేస్లైన్ ప్రశ్నపత్రము దీనితో జతచేయడమైనది.
3) 1 మరియు 2 తరగతుల విద్యార్థులకు Level 1 మరియు 3, 4 మరియు 5 తరగతుల విద్యార్థులకు Level 2 ప్రశ్నపత్రములు తయాయు చేయవలెను.
4) 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు విడివిడిగా సబ్జెక్ట్ వైస్ ప్రశ్నపత్రములు తయారు చేయించవలెను.
5). తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లకు విడివిడిగా ప్రశ్నపత్రములు తయారుచేయించవలెను.
6) బేస్లైన్ పరీక్ష పత్రములను విద్యార్థుల తల్లి తండ్రులకు అందచేయవలెను. ఎట్టి పరిస్థితిలోనూ విద్యార్థులను పాఠశాలలకు రప్పించకూడదు.
7). విద్యార్థులు బేస్లైన్ పరీక్షలు రాసిన జవాబు పత్రాలను విద్యార్థుల తల్లితండ్రుల నుండీ సేకరించవలెను.
8) బేస్లైన్ పరీక్షా పత్రములను ఈనెల 28 నుండి అగస్ట్ 3 వరకు సంబంధిత ఉపాధ్యాయులచే మూల్యాంకనం చేయించి ఫలితాలు మరియు సూచనలను విద్యార్థులకు what's app ద్వారా తెలియచేయవలెను.
9). బేస్లైన్ మార్కులను ఆగస్ట్ 4 నుండి 10 లోపు CSE వెబ్సైట్ లో ఆన్లైన్ చేయవలెను.
10). ఎట్టి పరిస్థితిలో బేస్లైన్ పరీక్షను పాఠశాలలో నిర్వహించకూడదు.
11). బేస్లైన్ పరీక్షలు కండక్ట్ చేయు విధి విధానములను తనిఖీ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించవలెనని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వవలెను.
BASELINE TEST నిర్వహణకు సూచనలు.
- అన్ని పాఠశాలలో అన్ని తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహణ చేయాలి.
- క్రింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాల అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇచ్చారు.
- వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష పత్రాలు తయారు చేసి నిర్వహణ చేయాలి.
- ఎట్టి పరిస్థితుల్లో విధ్యార్థుల ను పాఠశాల కు పిలవరాదు.
- తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి.
- పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31 వరకు.
- మూల్యాంకనం జూలై 28 నుండి 3 ఆగస్టు.
- మార్కుల నమోదు 4 ఆగస్టు నుండి 10 వరకు.
- Level-1 1&2 తరగతులకు
- Level-2 3,4&5 తరగతులకు.
- తెలుగు మరియు ఆంగ్లమాధ్యమంలో విడివిడిగా ప్రశ్న పత్రాలను అందజేయాలి.
- పై అంశం సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాలి.
No comments:
Post a Comment