- ఇంటి దగ్గరే పరీక్షలు..
- విద్యార్థులకు బేస్ లైన్ పరీక్షలు ప్రారంభం..
- ఒక్కొక్క సబ్జెక్టుకు గరిష్టంగా పది మార్కులు..
ఏటా విద్యా సంవత్సర ప్రారం భంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థు లకు నిర్వహించే ప్రారంభ పరీక్ష (బేన్ టెస్ట్)ను ఈ సారి వారి ఇళ్ల వద్దనే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రశ్నపత్రా లను తల్లిదండ్రులకు ఇచ్చి, విద్యార్థులతో జవా బులు రాయించేలా చూడాలని ఆదేశించింది. గత పాఠాలను పునశ్చరణ చేసుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా విద్యార్థి సామర్ధ్యాన్ని మదింపు చేయడానికి వీలుగా ఈ నెల 27 నుంచి 31 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో నాలుగు లక్షల మంది విద్యార్థులు తప్పని సరిగా ఈ పరీక్షలు రాయాల్సి ఉంది. గత తరగతిలో చదువుకున్న పాఠాల ఆధారంగా ఈ పరీక్షలు జరు గుతాయి. ఒకటి, రెండు తరగతులకు లెవెల్-1, మూడు నుంచి ఐదు తరగతులకు లెవెల్-2 పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో విడివిడిగా ప్రశ్న పత్రాలను అందజేస్తారు.
వెబ్సైట్ లో మోడల్ ప్రశ్నపత్రాలు..
బేస్ లైన్ మోడల్ ప్రశ్న పత్రాలను విద్యాశాఖ కమి షనర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సబ్జె క్టుల వారీగా ప్రధానోపాధ్యాయులు ఈ మోడల్ ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులకు అందజేస్తారు. వారు మోడల్ ప్రశ్నపత్రాన్ని ఆధారంగా చేసుకుని కొత్త ప్రశ్నపత్రం తయారు చేయాల్సి ఉంటుంది. వాటిని గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా తల్లిదండ్రులకు అందజేస్తారు. విద్యార్థులు పరీక్షలు రాసిన తరువాత జవాబు పత్రాలను ఉపాధ్యాయులు సేకరించుకుని మూల్యాంకనం చేస్తారు.
ప్రశ్న పత్రాలను సొంతంగా రూపొందించాలి..
ప్రతి పాఠశాలలోనూ ఆయా సబ్జెక్టులు బోధి స్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేకంగా బేస్ లైన్ ప్రశ్న పత్రాలను సిద్ధంచేసుకోవాలి. కొందరు మేము ఇచ్చి మోడల్ ప్రశ్నపత్రాలు యథాత థంగా వాడుకుంటున్నారు. ఇంకొందరు కొంత మేరకే మార్పులు చేస్తున్నారు. ఎవరో తయారు చేసిన ప్రశ్న పత్రాలను విద్యార్దులకు పంపిణీ చేస్తే చర్యలు తప్పవు.
No comments:
Post a Comment