ప్రభుత్వ పాఠశాలలలోని 8,9,10 తరగతుల విద్యార్థుల కోసం నిర్వహించబడుతున్న కౌశల్ 2021 - ప్రతిభాన్వేషణ పోటీ ప్రచారము చేయుచున్న అందరికీ ధన్యవాదములు.
కౌశల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. www.bvmap.org వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఈ క్రింది విషయాలు గమనించగలరు.
కౌశల్ 2021 లో ప్రధానంగా 3 పోటీలు ఉంటాయి.
1 క్విజ్ : క్విజ్ టీం ఎంపిక కోసం అన్ లైన్ లో ప్రాధమిక పరీక్ష Dec 8 న నిర్వహించబడును. 8,9,10 తరగతుల నుండి తరగతికి 10మంది విద్యార్థులు చొప్పున ఈ పరీక్ష వారి మొబైల్ ద్వారా కానీ లాప్ టాప్ ద్వారా కానీ డెస్క్ టాప్ ద్వారా కానీ వ్రాయవచ్చును. క్విజ్ రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థుల పేర్లు నమోదుచేయవలసిన అవసరం లేదు పాఠశాల నమోదు చేసుకొనినచాలు. వారి పాఠశాల నుండి 8,9,10 తరగతుల విద్యార్థులు 10 మందికి పరీక్ష వ్రాసే విధంగా గతంలో మాదిరిగా ఐ డి లు క్రియేట్ చేసి పంపబడును. కావున ఉపాధ్యాయులు వారి పాఠశాల నుండి తరగతికి పది మందిని ఎంపిక చేసి ఈ పరీక్ష వ్రాయించవలెను.
2. జనరల్ పోస్టర్ కాంపిటీషన్ : ఈ పోస్టర్ కాంపిటీషన్ లో పాఠశాల నుండి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చును. పాఠశాల నుండి ఈ విభాగంలో ఒక పోస్టర్ అనుమతించబడును.
3. స్వాతంత్ర అమృత మహోత్సవాల పోస్టర్ కాంపిటీషన్ : ఈ పోస్టర్ కాంపిటీషన్ లో కూడా 8,9 తరగతుల విద్యార్థులు పాల్గొనవచ్చును. పాఠశాల నుండి ఈ విభాగంలో ఒక పోస్టర్ అనుమతించబడును.
➤కావున క్విజ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. విద్యార్థుల పేర్లు ప్రస్తుతము రిజిస్టర్ చేయవలసిన అవసరము లేదు.
➤పోస్టర్ కాంపిటీషన్ లో మాత్రము ఇద్దరు విద్యార్థుల పేర్లు నమోదుచేయవలెను. పోస్టర్ అప్ లోడ్ చేయవలసిన పనిలేదు.
➤స్వాతంత్ర్య అమృత మహోత్సవాల పోస్టర్ కాంపిటేషన్ లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొనవచ్చును కావున ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ సమాచారం అందించగలరు.
➤ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ *స్వాతంత్య్ర అమృత మహోత్సవ పోస్టర్* పోటీ విడివిడిగా నిర్వహించబడును.
రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ : 15 నవంబర్ 2021
సిలబస్, పోస్టర్ కాంపిటీషన్ రూల్స్ మరియు Indian Contributions to Science స్టడీ మెటీరియల్ వెబ్ సైట్ లో అందుబాటులో కలవు. గమనించగలరు.
Registration here...
No comments:
Post a Comment