- పదోన్నతులకు పచ్చజెండా
- 26న ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్
అనంతరం
ఉపాధ్యాయుల పదోన్నతులపై నెలకొన్న సందిగ్ధం ఎట్టకేలకు వీడింది. పదోన్నతులు కల్పించడానికి విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. పాఠశాల సహాయకులకు ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడానికి గత నెల 14న ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 30వ తేదీ నాటికి పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఉప ఎన్నికలు, స్థానికసంస్థల ఎన్నికల కారణంగా 2 సార్లు వాయిదా పడ్డాయి. ఈనెల 26న ప్రధానోపాధ్యాయ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత స్కూల్‌అసిస్టెంట్ పోస్టులకు కౌన్సెలింగ్ జరపడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 33 ప్రధానోపాధ్యాయ పోస్టులు, 99 పాఠశాల సహాయకుల పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది.
సబ్జెక్టులవారీగా ఇలా ..
ఇంగ్లిష్ - 15, తెలుగు- 12, బయాలజీ- 16, సోషియల్- 34, ఫిజికల్ సైన్స్- 6, మ్యాథ్స్- 14, పీడీ- 2, ప్రధానోపాధ్యాయులు - 33 పారదర్శకంగా నిర్వహిస్తాం: శామ్యూల్, డీఈవో ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వచ్చిన వినతులు పరిశీలించి జాబితా రూపొందించాం. ఈనెల 26న ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. పాఠశాల సహాయకుల కౌన్సెలింగ్ తేదీలు తరువాత వెల్లడిస్తాం.
No comments:
Post a Comment