2023 నాటికి పూర్తి స్థాయిలోఆరంచెల విధానం.
ఆరంచెల విధానానికి అనుగుణంగా 2023 24 నాటికి పూర్తి అయ్యేలా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు ఇప్పటికే చేపట్టారు. ప్రస్తుతం 2,835 ప్రైమరీ స్కూళ్లను ఫౌండే షనల్ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. 2,682 హైస్కూళ్లకు 3-5 తరగతుల విద్యార్థులను అనుసంధానించారు. ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్ల నుంచి 1,73,441 మంది, మున్సిపల్ స్కూళ్ల నుంచి 30,013 మంది మొత్తం 2,03,454 మంది విద్యార్థులు హైస్కూళ్లకు అనుసంధా నమయ్యారు. 2022-23లో కిలోమీటర్ పరి ధిలోని ప్రైమరీ స్కూళ్లలో 3-5 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రీ హైస్కూల్, హైస్కూళ్లకు అనుసంధానిస్తారు. వాటిలో అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. ఇక జూనియర్ కాలేజీలు లేని 202 మండలాల్లోని హైస్కూళ్లలో + 2 తరగతులు ప్రారంభిస్తారు. 2023-24లో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధి లోని ప్రైమరీ స్కూళ్ల 3-5 తరగతుల విద్యా ర్ధులను ప్రీ హైస్కూల్, హైస్కూళ్లలో అనుసం ధానం చేస్తారు. ఈ హైస్కూళ్లను స్కూల్ ఆఫ్ ఎక్స్టెన్సులుగా మార్చేందుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క స్కూల్, అంగన్వాడీ కేంద్రం మూతపడ కుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ఏ ఒక్క టీచర్, అంగన్వాడీ వర్కర్ పోస్టూ పోకుండా జాగ్రత్తలు తీసుకుంది.
ఆరంచెల స్కూలింగ్ ఇలా ..
అంగన్వాడీ కేంద్రాలు మాత్రమే ఉండే చోట వాటిలో ప్రీ ప్రైమరీ -1 , ప్రీ ప్రైమరీ -2 ( పీపీ -1 , పీపీ -2 ) లను ప్రవేశపెట్టి వాటిని శాటిలైట్ ఫౌండేషనల్ స్కూళ్లుగా చేస్తోంది .
ప్రైమరీ పాఠశాలలున్న చోటవాటికి పీ -1 , పీపీ -2 లను అనుసంధా నించి 1 , 2 తరగతులతో ఫౌండేష నల్ స్కూళ్లుగా మారుస్తోంది .
3,4,5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ -1 , పీపీ -2 లను , 1-5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషనల్ ప్లస్ స్కూళ్లుగా మార్పు చేస్తోంది .
3 వ తరగతి నుంచి 7 / 8 వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా మారుస్తోంది .
3,4,5 తరగతుల పిల్లలను అనుసంధానం చేయడం ద్వారా 3-10 వరకు హైస్కూళ్లుగా పరిగణిస్తోంది .
3-10వ తరగతితోపాటు ఇంటర్మీడియెట్ ( 11 , 12 తర గతులను ) కలిపి హైస్కూల్ ప్లస్ గా మార్పు చేస్తోంది
No comments:
Post a Comment