Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ
(APSWREIS), తాడేపల్లి, గుంటూరు జిల్లా 2022-23 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశము కొరకు ప్రకటన
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలోను | మరియు IIT/NEET Academy అందు 2022-2023 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నందు ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను తేది: 08-03-2022 నుండి 31-03-2022 వరకు
https://apgpcet.apcfss.in/Inter ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి.
ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in/Inter వెబ్ సైట్ను సందర్శించగలరు.
Dr. B.R. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయ అధికారులను (District Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ విద్యాలయాల ప్రధానాచార్యులను (Principals) గాని సంప్రదించగలరు.
ప్రవేశ పరీక్ష తేది: 24-04-2022.
Click here to Online Application Form
https://apgpcet.apcfss.in/IntermediateForm.aprjdc
Click here to Print Application
https://apgpcet.apcfss.in/PrintInterApplication.aprjdc
-------------------------------
31 వరకు దరఖాస్తులకు గడువు
జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఐదు, ఇంటర్ ప్రథమ ఏడాది (ఆంగ్ల మాధ్యమ) ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. జిల్లాలో 10 బాలికల, 4 బాలుర గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. మొత్తం 14చోట్ల ఐదో తరగతిలో 1,120 సీట్లు ఉన్నాయి. పామర్రు మినహా మిగిలిన 13 గురుకులాల్లో ఇంటర్మీడియట్ సైన్సు, ఆర్ట్సు గ్రూపుల్లో 1,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బల్లిపర్రు, జగ్గయ్యపేట కళాశాలల్లో సీఈసీ, ఎంఈసీ సీట్లు 80 చొప్పున ఉన్నాయి. మిగిలిన 11 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు, పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ఇంటర్‌లో : ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశానికి apgpcet.apcfss.innter వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లు మించకూడదు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించి ఉండకూడదు.
ఐదో తరగతిలో చేరేందుకు...
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు http:///apgpcet.apcfss.in లో, వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు
ఐదు, ఇంటర్‌లో ప్రవేశాలకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంటర్ విద్యార్థులకు మరో పరీక్ష ద్వారా ఐఐటీ, నీట్‌లో శిక్షణకు సాంఘిక గురుకుల అకాడమీల్లో ప్రవేశం కల్పిస్తారు. ఓఎంఆర్ పద్ధతిలో నిర్దేశిత కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి
No comments:
Post a Comment