కేజీబీవీల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ:- సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.వెట్రిసెల్వి
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకురాలు కె.వెట్రిసెల్వి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసిన వారు), పేద ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి.ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే ప్రవేశాలకు పరిగణిస్తామని తెలిపారు. ఆసక్తిగల బాలికలు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పొందవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు. అదేవిధంగా సంబంధిత కేజీబీవీల నోటీసు బోర్డులో నేరుగా చూడవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 94943 83617, 94907 82111 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Website
No comments:
Post a Comment