నోషనల్ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి : జేడీ
సెకండరీ స్కూల్ టీచర్లుగా 1997 , 1998 డీఎస్సీలలోను , స్కూల్ అసిస్టెంట్లుగా 1997 , 1998 , 2000 , 2001 డీఎస్సీల్లోను ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అన్లైయిన్డ్ ఎస్టీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది . అన్ని జిల్లాల్లోని డీఈవోలు ఈ కేటగి రిలో ఉన్న ఎస్టీ ఉపాధ్యాయుల వివరాలు పంపించాలని విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం మంగళవారం ఒక మెమో విడుదల చేశారు . ఇలా వచ్చిన సమాచారాన్ని క్రోడీ కరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు .
No comments:
Post a Comment