ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కొరకు మార్గదర్శకాలు.
వయస్సు:: ఓసి , బీసీ ( OC , BC ) కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2010 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.
యస్.సి.ఎస్టీ ( SC , ST ) కులాలకు చెందిన విద్యార్థులు 01-09 2008 మరియు 31-08-2012 మధ్య పుట్టి ఉండాలి.
ప్రవేశ అర్హతలు:: సంబంధిత జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరవధికంగా 2020-2021 మరియు 2021-2022 విద్యా సంవత్సరములులో చదివి ఉండాలి.
2021-2022 విద్య సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారము కొరకు https://apms.ap.gov.in/apms/ చూడగలరు.
దరఖాస్తు చేయు విధానమ...
అభ్యర్ధులు పైన తెలుపబడిన అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేదీ 05.06.2022 నుండి 16.06.22 వరకు net banking / credit / debit card లను ఉపయోగించి gate way ద్వారా అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించ బడును ఆ జనరల్ నెంబరు ఆధారంగా వెబ్ సైట్ http://map.gov.in/apms/ ( online లో ) లో దరఖాస్తు చేసుకొనవలయును.
దరఖాస్తు చేయడానికి రుసుము
OC మరియు BC లకు రూ 100 / - ( ఆక్షరములా వంద రూపాయలు మాత్రమే ) SC మరియు ST లకు రూ.50 / - ( అక్షరములా ఏభై రూపాయలు మాత్రమే )
ప్రవేశములు లాటరీ ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడును ! ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల Principal ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని / మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగలరు
No comments:
Post a Comment