22-07-22 నుండి 26-07-22 వరకు నిర్వహించాల్సిన బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ విధానం...
ఇది 2 నుండి 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించాలి.
ఇది తెలుగు, ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో నిర్వహించాలి.
ఈ పరీక్ష రెండు పద్ధతులలో నిర్వహించాలి.
1. మౌఖిక పరీక్ష
2. వ్రాత పరీక్ష
2 నుండి 5 తరగతుల విద్యార్థులకు ఒక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
అలాగే 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు వేరొక వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రం ఉంటుంది.
మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం 2 నుండి 10 తరగతులకు కామన్ గా ఉంటుంది.(తెలుగు 2 పేజీలు,ఆంగ్లం 1 పేజీ, గణితం 2 పేజీలు, మొత్తం 5 పేజీలు)
2 నుండి 5 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం,గణితం లలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి. మరియు తెలుగు, ఆంగ్లం లో వ్రాత పరీక్ష నిర్వహించాలి.
వీరికి గణితంలో వ్రాత పరీక్ష ఉండదు. మౌఖిక పరీక్ష లోని గణిత ప్రక్రియలు నే వ్రాత పరీక్ష గా పరిగణించాలి.
ఈ పరీక్షకు విద్యార్థికి ప్రశ్న పత్రం ఇవ్వబడ దు. టీచర్ కాపీ ఉపయోగించి విద్యార్థితో నోటు పుస్తకము లో చేయించి స్థాయిని నిర్ధారించాలి.
6 నుండి 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం మరియు గణితం సబ్జెక్టుల్లో మౌఖిక మరియు వ్రాత పరీక్ష నిర్వహించాలి.
22-07-22 న తెలుగు,23-07-22 న ఆంగ్లం మరియు 25-07-22 న గణితం పరీక్షలు నిర్వహించాలి.
మౌఖిక పరీక్ష:
మౌఖిక పరీక్ష ప్రశ్నాపత్రం సెట్ 1 మరియు సెట్ 2 లు గా ఉంటుంది. ఇద్దరు వరుస విద్యార్థుల లో మొదటి విద్యార్థికి సెట్ 1 ఉపయోగించాలి. రెండవ విద్యార్థికి సెట్ 2 వాడాలి. తరువాతి విద్యార్థికి సెట్ 1 ... ఈ విధంగా 2 సెట్లను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.
విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠ శాల లోని అందరు ఉపాధ్యాయులు ఈ మౌఖిక పరీక్షను ( విద్యార్థులను ఒకరి తరువాత ఒకరిని పిలిచి) నిర్వహించి విద్యార్థి స్థాయిని అంచనా వేయాలి.
మౌఖిక పరీక్షలో సాధించిన స్థాయిలను ఆన్లైన్ లో 26-07-22 లోగా నమోదు చేయాలి.
మౌఖిక పరీక్ష లోని స్థాయిలు:
ప్రారంభ స్థాయి1: అక్షరాలను గుర్తించలేక పోవడం (తెలుగు)/ పెద్ద అక్షరాలను (క్యాపిటల్ లెటర్స్)గుర్తించలేక పోవడం( ఆంగ్లము)/ అంకెలను గుర్తించలేక పోవడం (మేథ్స్)
స్థాయి 2 :
అక్షరాలుగుర్తించడం( తెలుగు)/ పెద్ద అక్షరాలు గుర్తించడం( ఆంగ్లం)/అంకెలను గుర్తించడం( గణితం)
స్థాయి 3 :
పదాలు చదవడం( తెలుగు)/చిన్న అక్షరాలను గుర్తించడం( ఆంగ్లం)/ రెండంకెల సంఖ్యలను గుర్తించడం( గణితం)
స్థాయి 4 :
వాక్యాలు లేదా పేరాను చదవడం ( తెలుగు)/పదాలను చదవడం, అర్థం చెప్పడం( ఆంగ్లం)/మూడంకెల సంఖ్యలను గుర్తించడం ( గణితం)
స్థాయి 5:
కథ చదవడం( తెలుగు)/వాక్యాలు చదవడం,అర్థం చెప్పడం( ఆంగ్లం)/ గణిత ప్రక్రియలు చేయడం( గణితం)
వ్రాత పరీక్ష:
మౌఖిక పరీక్ష లో 4 మరియు 5 వ స్థాయిలు పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష ప్రశ్నాపత్రాలు 10 సెట్లుగా ఉంటాయి.
1 నుండి 10 వరుస సంఖ్య కల విద్యార్థులకు వరుసగా 1 నుండి 10 సెట్ల ప్రశ్నాపత్రం లు ఇవ్వాలి తరువాత 11 వరుస సంఖ్య కల విద్యార్థికి సెట్1 ప్రశ్న పత్రం వస్తుంది.
ఈ విధంగా ప్రతి 10 మందికి 1 నుండి 10 సెట్ల ను ఉపయోగించి పరీక్ష నిర్వహించాలి.
వ్రాత పరీక్ష నిర్వహించాక , జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిలను అంచనా వేయాలి.
వ్రాత పరీక్ష ద్వారా గుర్తించాల్సిన స్థాయిలు:
స్థాయి1: అసలు చేయని వారు
స్థాయి2: ప్రయత్నించారు, కానీ అన్నీ తప్పులే
స్థాయి3: రెండు మాత్రమే సరిగా వ్రాశారు
స్థాయి4: అన్నీ సరిగా వ్రాశారు
మౌఖిక పరీక్ష,వ్రాత పరీక్ష లో విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన క్రింది ఎక్సెల్ షీట్ నందు నమోదు చేసుకొని భద్రపరచుకోవాలి. అవే వివరాలను online website నందు 26-07-22 లోగా నమోదు చేయాలి.
విద్యార్థుల సంఖ్యను బట్టి వ్రాత పరీక్ష క్వశ్చన్ పేపర్ ను, ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి సూచనల ప్రతులు,మౌఖిక ప్రశ్నాపత్ర ములనుMEO లు ప్రాథమిక పాఠ శాల లకు డిస్ట్రిబ్యూట్ చేయాలి.
ఉన్నత పాఠ శాల లకు పాఠ శాల ల వారీగా వ్రాత ప్రశ్న పత్రం ప్యాక్ చేయబడి ఉంటుంది.మౌఖిక పరీక్ష ప్రశ్న పత్రములు,సూచనల ప్రతులు ఉన్నత పాఠ శాల లోని ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి పంపిణీ చేయాలి.
పరీక్ష నిర్వహణ విధానం స్పెసిఫిక్ ఇంస్ట్రక్ష న్స్ కొరకు pdf format లోని ఇంస్ట్రక్ష న్స్ మాన్యూయల్ ను చడగలరు.
ముఖ్య సూచన:
ప్రారంభ పరీక్షకు అందరు విద్యార్థులు హాజరగు నట్లు చూడాలి. ఒకవేళ ఎవరైనా ఆబ్సెంట్ అయితే వారికి మరుసటి రోజైనా సరే పరీక్ష నిర్వహించి స్థాయిలను గుర్తించాలి.
ప్రారంభ పరీక్ష ఫలితాలను ప్రతి పాఠ శాల లో విజిటింగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.
విద్యార్థుల స్థాయిలను అంచనా వేసిన తరువాత , 1,2,3,4 స్థాయిలలో ఉన్న విద్యార్థులను 5 వ స్థాయికి తీసుకురావడానికి పాఠ శాల remedial teaching plan( ప్రత్యామ్నాయ బోధనా ప్రణాళిక) తయయారుచేసి అమలు చేయాలి.
విజిటింగ్ అధికారులు పాఠ శాల సందర్శించినప్పుడు బేస్లైన్ టెస్ట్ లో స్థాయి కంటే విద్యార్థి యొక్క actual స్థాయి తక్కువగా ఉండరాదు.
కావున విద్యార్థుల actual స్థాయిలను నిర్ధారించే లా పరీక్ష నిజాయితీగా , కాపీ కి ఆస్కారం లేకుండా నిర్వహించాలి.
ఈ నూరు రోజుల కార్యక్రమం పూర్తయ్యే నాటికి పాఠ శాల లోని విద్యార్థులందరూ 5 వ స్థాయికి చేరుకోవాలి.
---------------------------
నిన్న Baseline test పై జరిగిన Webex లోని ముఖ్యమైన విషయాలు.
1.ఈ Baseline test కేవలం విద్యార్థుల స్థాయిని తెలుసుకొనుటకు మాత్రమే 2.Baseline test నిర్వహించడానికి ముందుగా విద్యార్థులు కు ఓరల్ టెస్ట్ నిర్వహించాలి.
22/07/2022 ---- TELUGU ORAL TEST.
23/07/2022 ---- ENGLISH ORAL TEST.
25/07/2022 ---MATHS ORAL TEST.
26/07/2022 ---- రాత పరీక్ష ఉండును.
3.ORAL TEST లో విద్యార్థులను 5 రకాలుగా విభజించాలి.
TELUGU ORAL TEST :-
L1--- ప్రారంభకులు (ఏమీ రానివారు)
L2---అక్షరాలు గుర్తించుట.
L3---పదాలను చదవడం.
L4---పేరాలు, వాక్యాలు చదవడం (3కన్నా తక్కువగా తప్పులు ఉండాలి)
L5---కథలు చదవడం.
MATHS :-
L1-- ప్రారంభకులు (ఏమి రానివారు).
L2---ఒక అంకె సంఖ్యలు.
L3--రెండు అంకెల సంఖ్యలు.
L4---మూడు అంకెల సంఖ్యలు.
L5-- గణిత ప్రక్రియలు (+,౼,×,÷చేయువారు)
ENGLISH :-
L1--ప్రారంభకులు (ఏమి రానివారు).
L2--పెద్ద అక్షరాలు (ABCD)
L3--చిన్న అక్షరాలు(abcd)
L4 --Words.
L5 -- వాక్యాలు.
పై స్థాయిలలో L4, L5 ల లో ఉన్న విద్యార్థులు కు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి. పై లెవెల్స్, మార్క్స్ అన్ని విద్యార్థులు వారీగా క్రింది ఇవ్వబడిన XL sheet fill చేసి అదేవిధంగా online లో enter చేయుటకు బధ్రపరుచుకోవలెను. marks regester లో enter చేయవలెను.
గమనిక :- L4, L5 విద్యార్థులకు పరీక్ష ను చూసిరాతలు లేకుండా చూడవలెను, ఎందుకనగా పై అధికారులు వచ్చి విద్యార్థులను పరిశీలించినపుడు వారి లెవెల్ తగ్గితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-----------------------
Download Orel Test Telugu Sample 1&2
-----------------------
Download Telugu written Test 2-5
------------------------
Download English Paper Pencil Test 2-5
------------------------
బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు
తెలుగు
ఒక్కొక్క విద్యార్థిని పిలిచి మొదటగా ఇచ్చిన ప్రశ్నా పత్రం లోని రెండు పేరాలలో ఏదైనా ఒక చదవమని కోరాలి.
పేరాను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి *పేరా స్థాయి* లో ఉన్నట్లుగా గుర్తించాలి.
అప్పుడు ఆ విద్యార్థిని కథ చదవమని కోరాలి. కథను మూడు కంటే తక్కువ తప్పులతో చదివితే ఆ విద్యార్థి కథా స్థాయి లో ఉన్నట్లుగా గుర్తించాలి.
పేరాను మూడు కంటే ఎక్కువ తప్పులతో చదివిన విద్యార్థులను ప్రశ్నా పత్రం లోని ఏవైనా ఐదు పదాలను చదవమని కోరాలి.
ఐదు పదాలలో కనీసం నాలుగు పదాలు స్పష్టంగా చదవగలిగిన విద్యార్థిని *పదాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఐదు పదాలలో నాలుగు పదాలు సరిగ్గా చదవక పొతే ఆ విద్యార్థిని ప్రశ్నా పత్రం నుంచి ఏవైనా ఐదు అక్షరాలు చదవమని కోరాలి.
ఐదు అక్షరాలలో కనీసం నాలుగు అక్షరాలు సరిగ్గా గుర్తించినట్లైతే ఆ విద్యార్థి *అక్షరాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఐదు అక్షరాలలో నాలుగు అక్షరాలు గుర్తించకపోతే ఆ విద్యార్థి *ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
గణితం
ప్రశ్నా పత్రంలో ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే తక్కువ అంకెలను విద్యార్థి గుర్తించినట్లయితే ఆ విద్యార్థి ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఇచ్చిన ఆరు అంకెలలో నాలుగు కంటే ఎక్కువ అంకెలను గుర్తించిన విద్యార్థిని రెండు అంకెల సంఖ్యలను గుర్తించమని అడగాలి.
ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *ఒక అంకె సంఖ్యల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఇచ్చిన రెండు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని మూడు అంకెల సంఖ్యలను గుర్తించామని అడగాలి.
ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే తక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థి *రెండు అంకెల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఇచ్చిన మూడు అంకెల సంఖ్యలలో నాలుగు కంటే ఎక్కువ సంఖ్యలను గుర్తించిన విద్యార్థిని చతుర్విధ ప్రక్రియలోని కూడిక తీసివేత గుణకారం భాగాహారంలకు సంబందించిన ప్రశ్నలు అడగాలి.
చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలకు సరైన సమాధానం చేయని విద్యార్థులను మూడంకెల స్థాయిలో ఉన్నట్లు గుర్తించాలి.
చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేయని విద్యార్థులను *మూడంకెల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
చతుర్విధ ప్రక్రియలకు సంబంధించి ప్రతి విభాగంలో మూడు ప్రశ్నలకు రెండు ప్రశ్నలను సరిగ్గా చేసిన విద్యార్థులను *గణిత ప్రక్రియల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఇంగ్లీష్
ఇచ్చిన ప్రశ్నా పత్రంలోని ఏవైనా ఐదు కాపిటల్ లెటర్స్ ను చదవమని విద్యార్థిని కోరాలి.
ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి *ప్రారంభ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఐదు కాపిటల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు స్మాల్ లెటర్స్ చదవమని కోరాలి.
ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదవకపోతే ఆ విద్యార్థి *కాపిటల్ లెటర్స్ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఐదు స్మాల్ లెటర్స్ లో నాలుగు లెటర్స్ చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని ఐదు సులభ పదాలు చదవమని కోరాలి.
ఐదు సులభ పదాలలో నాలుగు పోతే చదవకపొతే ఆ విద్యార్థి *స్మాల్ లెటర్స్ స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ఐదు సులభ పదాలలో నాలుగు పదాలు చదివిన విద్యార్థిని ఇచ్చిన జాబితాలోని నాలుగు సులభ వాక్యాలు చదవమని కోరాలి.
నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవని విద్యార్థిని *పదాల స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
నాలుగు సులభ వాక్యాలలో రెండు వాక్యాలు అర్థవంతంగా చదవగలిగిన విద్యార్థి *వాక్యాలు స్థాయి* లో ఉన్నట్లు గుర్తించాలి.
ముఖ్య గమనిక
ఇంగ్లీష్ టూల్ రెండు విభాగాలుగా ఉంటుంది. 1. చదవడం 2. అర్థంచేసుకోవడం
కనుక ఐదు పదాలలో నాలుగు పదాలు చదవగలిగిన విద్యార్థిని ఆ పదాలకు అర్ధాలను వారి వాడుక భాషలో చెప్పమని కోరాలి.
అదేవిధంగా నాలుగు వాక్యాలలో రెండు వాక్యాల యొక్క అర్ధాన్ని వారు మాట్లాడే వాడుక భాషలో చెప్పమని కోరాలి.
రాత పరీక్ష కు సంబంధించి అతి ముఖ్య గమనిక
మౌఖిక పరీక్షలలో *నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.
------------------------
No comments:
Post a Comment