- గురువులకు బయోమెట్రిక్
- పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
- ఉపాధ్యాయుల హాజరు నమోదుకు ప్రత్యేక యాప్
- ఫేస్ రీడింగ్ ద్వారా అటెండెన్స్ నమోదు
- రెండు మూడు రోజుల్లో అమలు
- ప్రత్యేకంగా యాప్ డిజైన్
గురువుల హాజరుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ని రూపొందించింది . వాస్తవానికి ఆగస్టు ఒకటి నుంచి ఈ విధానం మొదలుకావాల్సి ఉన్నప్పటికీ .. నూతన సాంకేతికతతో యాప్ను ఆవిష్కరిం చాలని భావించి గడువు పెంచినట్టు సమాచారం .
రెండు మూడు రోజుల్లో దీన్ని అమల్లోకి తీసు కురానున్నారు . ఇప్పటివరకు రిజిస్టర్ సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు ఇక నుంచి హాజరును ఫేస్ రీడింగ్ ఆధారంగా హాజరు వేయాల్సి ఉంటుంది .
యాప్ లో హాజరు మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు .
సెలవులకు దరఖాస్తులు సైతం యాప్లోనే ...
ఈ ఉపాధ్యాయ హాజరు యాప్లో అనేక సాంకేతిక తను జత చేసి , అనేక సౌలభ్యాలను పొందుపర్చుతున్నారు . లొకేషన్ లింక్తో బయోమెట్రిక్ హాజరు ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలకు ఏ సమయా నికి వస్తున్నారు ? ఎంత ఆలస్యంగా వస్తున్నారన్నది కచ్చితంగా తెలుస్తుంది .
అలాగే ఉపాధ్యాయులు సెలవుల కోసం ఈ యాప్లోనే దరఖాస్తు చేసుకో వాల్సి ఉంటుంది .
తద్వారా ఆ ఉపాధ్యాయుడు ఎ న్ని సెలవులు పెట్టారు ? ఎన్ని సెలవులు ఉన్నాయి ? అనే వివరాలు మొత్తం రాష్ట్ర కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరనుంది .
విద్యార్థులు , మధ్యాహ్న భోజనం హాజరూ ఇదే యాప్లో ఉంటుంది .
విద్యా ర్థులు హాజరు వేసే సమయంలోనే మధ్యాహ్న భో జనం తినే పిల్లల వివరాలను నమోదు చేయాలి .
ఉపాధ్యాయుల సెల్ఫోన్లోనే ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
No comments:
Post a Comment