Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Head Masters Capacity Building మీటింగ్ నందలి ముఖ్య అంశములు

 Head Masters Capacity Building మీటింగ్ నందలి ముఖ్య అంశములు

➢ప్రతి ఉపాధ్యాయుడు లెసన్ ప్లాన్ వ్రాయవలెను, టీచర్ డైరీ వ్రాయవలెను.

➢ప్రధానోపాధ్యాయుడు 8 పీరియడ్లు తీసుకొనవలెను పదవతరగతి తీసుకునవలెను. లెసన్ ప్లాన్, టీచర్ డైరీ కూడా వ్రాయవలెను.

➣త్వరలో లెసన్ ప్లాన్ కు యాప్ తయారు చేస్తారు ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన లెసన్ ప్లాన్ ఉపాధ్యాయులు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

➣ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ లు పకడ్బందీగా నిర్వహించవలెను మరియు ప్రిన్సిపుల్స్ వ్రాసిన తరువాత కరెక్షన్ చేయవలెను.

➢ఈనెల 22వ తారీకు బేస్ లైన్ పరీక్ష ఉంటుంది దాని ప్రకారం వెనుకబడిన విద్యార్థులను గుర్తించి రెమిడియల్ టీచింగ్ చేయవలెను.

➢Foundation  Literacy Numerousy FLN ప్రకారం భాషల యందు, గణితమునందు సామర్థ్యములు విద్యార్థులు సంపాదించవలెను.

➣లెసన్ ప్లాన్స్ మరియు ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యూయేషన్ కొందరు ఉపాధ్యాయులు విద్యార్థుల చేత వ్రాయిస్తున్నారని పై అధికారుల దృష్టికి వచ్చింది అని డీఈఓ మేడం తెలియజేశారు.

➣ప్రతి నెల పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగు మరియు పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరుపవలెను.

➢అకాడమిక్ క్యాలెండర్, ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ప్రింట్ అవుట్ ప్రధానోపాధ్యాయుని టేబుల్ పై ఉండవలెను.

➢అకాడమిక్ క్యాలెండర్ ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయునికి పవిత్ర గ్రంథము వంటిదని, దానిని అనుసరించి కార్యక్రమములు జరుపవలెనని, దానిని రికార్డు చేయవలెనని పై అధికారులు వచ్చినప్పుడు చేసిన కార్యక్రమంలో రికార్డ్ చూపవలెనని తెలియజేశారు.

➣ఉపాధ్యాయులతో రివ్యూ మీటింగ్ జరుపవలెనని పాఠశాల అనంతరం నాలుగు గంటల నుండి జరుపుకొనవలెనని తెలియజేశారు.

➣నలుగురు ఆర్పీలు SCERT నుండి ట్రైనింగ్ పొంది, అక్కడ మీకు క్యాలెండర్ నందు ఉన్న విషయాలను వివరించారు.

➢తరచూ పై అధికారుల సందర్శనలు ఉంటాయని SCERT వారు తెలియజేశారని చెప్పి ఉన్నారు.

➢విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ చేయవలెను.

➣NMMS, NTSC వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయవలెను.

➢INSPIRE కు విద్యార్థులను సిద్ధం చేయవలెను.

➢ఆటలు క్రీడలు నాలుగు నుండి ఐదున్నర వరకు నిర్వహించవలెను.

➢ప్రతి శనివారం మాస్ డ్రిల్ నిర్వహించవలెను.

➢నవంబర్ 26 మాక్ పార్లమెంట్ నిర్వహించవలెను.

➢భాషా దినోత్సవములు, గణిత దినోత్సవము, సైన్సు దినోత్సవము నిర్వహించవలెను.

➣గ్రంథాలయ పుస్తకముల నిర్వహణ కొరకు ఇచ్చిన శిక్షణ ప్రకారం గ్రంధాలయ పుస్తకముల వినియోగం జరగవలెను విద్యార్థుల యందు పఠన ఆసక్తి పెంచవలెను.

➣ప్రభుత్వం వారు ఆదేశించిన ఇతర కార్యక్రమములు నిర్వహించవలెను.

➢సైన్సు lab  ఉపయోగించవలెను.

➣TLM ఉపయోగించవలెను.

➢పాఠశాల ఆస్తులు పరిరక్షించునట్లుగా విద్యార్థుల మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకురావలెను.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND