ఇన్స్పైర్ అవార్డ్సుకు నమోదు ప్రక్రియ ప్రారంభం
జిల్లాలో ఇన్ స్పైర్ అవార్డ్సు-మనక్ 2022-23కు ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 30 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత పాఠ శాలల విద్యార్థులు 5 ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల వారివి 3 ప్రాజెక్టులు ఉండాలి. ఎంపిక చేసిన బృందాల్లో ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీల నుంచి కనీసం ఇద్దరు ఉండే విధంగా చూడాలి. పాఠశాలల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసేటప్పుడు డైస్ నంబరు, మెయిల్ ఐడీతో నమోదు చేయాలని సూచించారు. www.inspireawards-dst.gov.in ద్వారా వెబ్ పేజిని ప్రారంభించి దానిలో స్కూల్ అథారిటీని క్లిక్ చేసినప్పుడు ఒన్ టైమ్ సెటిల్మెంట్ వస్తుంది. దానిని క్లిక్ చేసి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.
ఈ వివరాలు అవసరం: ఉన్నత పాఠశాల నుంచి అయిదుగురు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థుల పేర్లు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబరు, విద్యార్థి బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ ఎస్సీ కోడ్, బ్రాంచి పేరు లతో సమాచారం నింపాలి. విద్యార్థులకు సంబం ధించిన ప్రాజెక్టు రైట్అపు ఫొటోలతో సహా అప్లోడ్ చేయాలి. తరువాత జిల్లా అధికారులకు ఈ సమాచారాన్ని పంపాలి.
----------------------------------
---------------------------------
No comments:
Post a Comment