ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు క్యారీడ్ ఫార్వార్డ్ వేకెన్సీలు, 90 తాజా వేకెన్సీలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపింది. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ వంటి పలు పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మరి నోటిఫికేషన్ లో ఉన్న పోస్టులు ఏంటి? పోస్టుకు అప్లై చేయడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? జీతం ఎంత? అనే వివరాలు మీ కోసం.
మొత్తం ఖాళీలు: 92
క్యారీడ్ ఫార్వార్డ్ ఖాళీలు: 02
తాజా ఖాళీలు: 90
డిప్యూటీ రిజిస్ట్రార్: 01
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి రూ. 1,47,760/- వరకూ
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 01
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
డిప్యూటీ కలెక్టర్ ఇన్ ఏపీ సివిల్ సర్వీస్: 10
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 61,960/- నుంచి 1,51,370/- వరకూ
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 12
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 61,960/- నుంచి 1,51,370/- వరకూ
డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్: 13
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 61,960/- నుంచి 1,51,370/- వరకూ
డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ జైల్స్: 02
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్: 02
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 21 నుంచి 28 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 08
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్: 02
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్: 07
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్: 03
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్: 01
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 57,100/- నుంచి 1,47,760/- వరకూ
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2: 06
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ / లే సెక్రటరీ & ట్రెజరర్: 18
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 04
వయసు పరిమితి: 01/07/2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ళు ఉండాలి.
జీతం: రూ. 54,060/- నుంచి 1,40,540/- వరకూ
అర్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి.
డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే వారు మాత్రం ఇంజనీరింగ్ ఫైర్ విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. ఒకవేళ ఇందులో అర్హత లేకపోతే బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయసు సడలింపు:
ఎస్సీ/ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్: 05 ఏళ్లు
క్యారీడ్ ఫార్వార్డ్ పోస్టులకు ఎస్సీ/ఎస్టీ: 10 ఏళ్లు
దివ్యాంగులకు: 10 ఏళ్లు
ఎక్స్ సర్వీస్ మేన్, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ గా పని చేసిన వారికి: 03 ఏళ్లు
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు(కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉద్యోగులకు కాదు): 05 ఏళ్లు
పరీక్ష తేదీలు:
ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 18 2022
మెయిన్ పరీక్షలు: మార్చి 15 2023 తర్వాత
జిల్లాల వారీగా ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు:
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు
మెయిన్ ఎగ్జామ్ పరీక్షా కేంద్రాలు:
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం
ఇతర వివరాలు:
దరఖాస్తు ఫీజు: రూ. 250/-
పరీక్ష ఫీజు: రూ. 120/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ & ఎక్స్ సర్వీస్ మెన్ లకి పరీక్ష ఫీజు: లేదు
దరఖాస్తు చివరి తేదీ: 02/11/2022
దరఖాస్తు విధానం:
https://psc.ap.gov.in లోకి వెళ్లి వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
----------------------------------
Click here Online Application Submission
-------------------------------------
No comments:
Post a Comment