Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

CBA ప్రశ్నాపత్రాల నమూనా

CBA  ప్రశ్నాపత్రాల  నమూనా

1 నుండి 8 తరగతులకు  CBA (Class room Based Assessment - తరగతి గది  ఆధారిత మూల్యాంకనం) నందు ప్రశ్నలు రెండు రకాలుగా ఉండును.

  1.  MCQs (Multiple Choice Questions - బహుళైచ్చిక ప్రశ్నలు)
  2.  FRs (Free Response questions - అంతం లేని స్వయం ప్రతిస్పందన ప్రశ్నలు)
  3. 1 నుండి 2 తరగతులకు : పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.

3 నుండి 8 తరగతులకు : పది MCQ లు మరియు రెండు నుండి ఐదు FR లు ఉండగలవు.


MCQ (Multiple Choice Questions) లు :

ప్రతి ప్రశ్నకు తార్కిక ఐచ్చికాలు ఇవ్వబడతాయి.

వాటి నుండి విద్యార్థులు ఒక ఖచ్చిత జవాబును  ఎంపిక చేసుకోవలసి ఉంటుంది.

MCQ ల వలన లాభాలు:

1) విద్యార్థులకు సంబంధించిన యదార్ధ జ్ఞానం, వినియోగం, అనుమితిల యొక్క వివిధ రకాల నైపుణ్యాలను పరీక్షించేందుకు సహాయపడతాయి.

2) విద్యార్థుల యొక్క సాధారణ దోషాలను ఖచ్చితత్వంతో కనుగొనేందుకు సహాయపడతాయి.

FR (Free Response questions) లు :

 విద్యార్థులు తమకు ఇవ్వబడిన అంతం లేని ప్రశ్నలకు స్వయం ప్రతిస్పందనలు ఇస్తారు.

వీనిలో  ఖాళీలను పూరించుము , అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు , స్వల్ప సమాధాన ప్రశ్నలు , దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇవ్వబడతాయి.


MUA Balance questions (Mechanical - Understanding - Application balance యాంత్రిక - అవగాహన - వినియోగ సంతులిత ప్రశ్నలు)

Mechanical యాంత్రిక ప్రశ్నలు : సాధారణంగా పాఠ్యపుస్తకాల నుండి తీసుకొనబడిన / సేకరించబడిన ప్రశ్నలు.

Understanding అవగాహనను పరీక్షించు ప్రశ్నలు :సంభావిత జ్ఞానం  మరియు జోడించిన / అదనపు స్థాయిని పరీక్షించు ప్రశ్నలు.

➠Application వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు :సముపార్జించిన  సంభావిత జ్ఞానాన్ని  నిజ జీవిత సందర్భాలలో వినియోగాన్ని పరీక్షించు ప్రశ్నలు.

  1. 1 నుండి 2 తరగతులకు MUA ల సంతుల్యత అన్ని సబ్జెక్టులకు  50% - 25% - 25% ఉండును.
  2. 3 నుండి 8 తరగతులకు  MUA ల   సంతుల్యత  క్రింది విధంగా ఉండును.
  3. తెలుగు,హిందీలకు 40% - 40% - 20%
  4. ఇంగ్లీష్ కు 30% - 40% - 30%
  5. సైన్స్,సోషల్, గణితం లకు 30% - 40% - 30%
  6. Difficulty level of question paper - ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి.
  7.  ప్రతి ప్రశ్నాపత్రం యొక్క కష్టస్థాయి    48% నుండి 50% వరకు ఉండగలదు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND