టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు 24 వరకు పొడిగింపు..
రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్ష లకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెస్సీ, ఓఎస్సెస్సీ, వొకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు ఈ పొడిగింపు తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజులు చెల్లించాలని పేర్కొ న్నారు. ఆలస్య రుసుం రూ.50తో డిసెంబర్ 25 నుంచి 29 వరకు, రూ.200తో డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో జనవరి 4 నుంచి 9 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
No comments:
Post a Comment