అంబేద్కర్ యూనివర్సిటీలో త్వరలో బీఈడీ కోర్సు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2022-23 వార్షిక సంవత్సరంలో బీఈడీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు సార్వత్రిక విశ్వవిద్యాలయం అభ్యసన సహాయక సేవా విభాగం సంచాలకులు డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని రీజినల్ డైరెక్టర్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విజయకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్( ఎన్‌సీటీఈ) నుంచి అనుమతి మంజూరైందని తెలిపారు. విద్యార్థి వ్యవహారాల డీన్ బానోత్ లాల్ మాట్లాడుతూ గతంలో బీఈడీ కోర్సు నిర్వహించేవారమన్నారు. పరిపాలన కారణాలతో మధ్యలో నిలిపివేసినందున ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బీఈడీలో అడ్మిషన్ పొందేందుకు డిగ్రీలో 50 శాతం మారులు ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు 40 శాతం మారులు ఉండాలని ఆయన కోరారు. డీఎడ్ పండిట్ ట్రైనింగ్, ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారికి ప్రవేశం ఉంటుందని తెలిపారు. సాధారణ బీఈడీ కోర్సు చేసే అభ్యర్థులు మాత్రం డిగ్రీలో 50 శాతం మారులు కలిగి ఉండాలని, రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులు 45 శాతం మారులు ఉండాలన్నారు. అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థానిక అభ్యర్థులు రిజర్వేషన్లు విధానాన్ని అనుసరిస్తారని పేర్కొన్నారు.
నాలుగు డిప్లమా కోర్సులు ప్రారంభం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ వార్షిక సంవత్సరం నుంచి నాలుగు పీజీ డిప్లమా కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అభ్యాసక సహాయక సేవా విభాగం సంచాలకులు డాక్టర్ విజయకృష్ణారెడ్డి తెలిపారు. ఇందులో పీజీ డిప్లమా ఇన్ మారెటింగ్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లమా ఇన్ ఆపరేషనల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కోర్సులు కొత్తగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పరీక్షలు నిర్వహణ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, పుస్తకాల ముద్రణ విభాగం డైరెక్టర్ డాక్టర్ సమ్మయ్య, వరంగల్ ప్రాంతీయ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment