Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

Income Tax:: పన్ను చెల్లింపు ఉద్యోగులకు, DDOలకు సూచనలు

ఆదాయ పన్ను సమాచారం

పన్ను చెల్లింపు ఉద్యోగులకు, DDOలకు సూచనలు


ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.


అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది

March-May  15%

Jun-Aug 45%

Sep-Nov  75%

Dec-Feb 100%


అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.


ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.


ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.

 

కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.

 

ప్రతి ఉద్యోగి జూలై 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచోఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.

DDO లకు సూచనలు

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)


DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.


లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)


DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.


TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.


TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.


ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.


పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు....

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND